అన్వేషించండి

AP NMMS Notification: ఏపీలో 4 వేల మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్స్, నాలుగేళ్లపాటు 48 వేల రూపాయల ఆర్థికసాయం

AP NMMS: ఏపీలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌-2024 నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబరు 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

AP National Means-cum-Merit Scholarship Scheme (NMMSS): దేశంలో ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్)' పథకానికి సంబంధించి  ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం లక్ష ఉపకారవేతనాలు అందిస్తుండగా.. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 వేల స్కాలర్‌షిప్స్ కేటాయించారు.

వివరాలు..

* నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024-25

అర్హతలు..
✦ ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది  ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. 
✦ ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
✦ కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

దరఖాస్తు విధానం:  రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్‌బీఐ చలానా రూపంలో ఫీజు చెల్లించాలి.

ALSO READ: తెలంగాణ NMMS 2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 
✦ మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.
✦ స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): ఈ పేపర్‌లోనూ 90 ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.

కనీస అర్హత మార్కులు: రెండు పరీక్ష(మ్యాట్, శాట్‌)ల్లో సగటున జనరల్‌ అభ్యర్థులకు 40 శాతం (36) మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32 శాతం (29)మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.

స్కాలర్‌షిప్ మొత్తం: ఎంపికైనవారికి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 05.08.2024.

➥ సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరితేదీ: 10.09.2024.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.09.2024.

➥ విద్యార్థుల నామినల్ రోల్స్, ఇతర ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో సమర్పించడానికి చివరితేది: 10.09.2024.

➥ దరఖాస్తులు డీఈవో ఆమోదం పొందేందుకు చివరితేది: 15.09.2024.

➥ పరీక్ష తేదీ: 08.12.2024.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Safest Cars: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget