అన్వేషించండి

CTET - 2022 హాల్‌టికెట్లు వచ్చేశాయి, డౌన్‌లోడ్ చేసుకోండి! పరీక్ష ఎప్పుడంటే?

సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబరు-2022 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) డిసెంబరు 26న విడుదల చేసింది. హాల్‌టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు.

CTET అడ్మిట్ కార్డ్ 2022 డైరెక్ట్ లింక్

సీబీఎస్‌ఈ డిసెంబరు 20నే అభ్యర్థులకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ (ప్రీ-అడ్మిట్ కార్డ్) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. అభ్యర్థులు పరీక్ష రోజున అడ్మిట్ కార్డును మర్చిపోకూడదు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడం మంచింది. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 28, 29 తేదీల్లో సీటెట్ (డిసెంబరు)-2022 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ ఏడాది సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.59 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తం 74 నగరాల్లోని 243 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.

సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

సీటెట్ నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
SmartEd Conclave 2026: వంట గది పాఠాలతో కోడింగ్ విప్లవం - 18 ఏళ్ల విజ్ కిడ్ ఆర్యమాన్ సరికొత్త ప్రయోగం!
వంట గది పాఠాలతో కోడింగ్ విప్లవం - 18 ఏళ్ల విజ్ కిడ్ ఆర్యమాన్ సరికొత్త ప్రయోగం!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Finn Allen Century: 33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
Embed widget