అన్వేషించండి

CLAT 2023 Results: వెబ్‌సైట్‌లో క్లాట్-2023 స్కోరు కార్డులు, డౌన్‌లోడ్ లింక్ ఇదే!

అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోరుకార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్లాట్ అప్లికేషన్ నెంబరు/ అడ్మిట్ కార్డు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్ష ఫలితాలను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోరుకార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్లాట్ అప్లికేషన్ నెంబరు/ అడ్మిట్ కార్డు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

క్లాట్‌-2023 పరీక్ష డిసెంబర్ 18వ తేదీన జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ జాతీయస్థాయి పరీక్ష క్లాట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. ఐదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. క్లాట్‌లో ప్రతిభ చూపి.. నేషనల్‌ లా యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసుకుంటే..న్యాయవాద వృత్తితోపాటు.. కార్పొరేట్‌ రంగంలోనూ.. కొలువుదీరొచ్చు. ఈ ఫ‌లితాల‌తో పాటు ఫైన‌ల్ కీ ని కూడా విడుద‌ల చేశారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల‌తో పాటు.., రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 127 సెంటర్స్‌లో ఈ క్లాట్ ఎగ్జామ్ 2023ను నిర్వహించారు.

క్లాట్-2023 స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి.. 

క్లాట్ - 2023 ఫైనల్ కీ

క్లాట్-2023 ప్రవేశపరీక్ష ద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా. దరఖాస్తుకు చివరితేది నవంబరు 13తో ముగియగా.. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించారు. డిసెంబరు 18న ఆన్సర్ కీ విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం డిసెంబరు 23న తుది కీ విడుదల చేశారు.

✸ కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాలు

కోర్సులు..

✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ:
✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
✪ క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం  (28–32) ప్రశ్నలు వస్తాయి. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:

✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget