అన్వేషించండి

CLAT Application: క్లాట్ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువును కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నవంబరు 10 వరకు పొడిగించింది.

దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువును కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నవంబరు 10 వరకు పొడిగించింది. వాస్తవానికి నవంబరు 3తో ముగియాల్సి దరఖాస్తు గడువును మరోవారంపాటు పెంచింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

వివరాలు..

✸ కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2024 

పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా).
కోర్సులు..

✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.4000. ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.3,500 చెల్లించాలి.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ:
మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ చాయిస్‌లో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆంగ్ల భాష, కరెంట్ అఫైర్స్‌తో సహా జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఐదు విభాగాలుగా విభజించారు. ఆంగ్ల భాష నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, కరెంట్ అఫైర్స్/ జనరల్ నాలెడ్జ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లీగల్ రీజనింగ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లాజికల్ రీజనింగ్ నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10-14 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 10 శాతం ప్రశ్నలు అడుగుతారు. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:
✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పరీక్ష సమయం: 2 గంటలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.07.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2023. (10.11.2023 వరకు పొడిగించారు)

➥ క్లాట్‌-2024 పరీక్ష తేది: 03.12.2023.

Online Application

Syllabus and Format for CLAT 2024

Website

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
Embed widget