News
News
వీడియోలు ఆటలు
X

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో జులై నాటికి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 9 కొత్త వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు.

కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మార్చి 28న జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు. కళాశాలకు అవసరమైన ఫర్నిచర్, పరికరాలను సమకూర్చుకోవాలని, అన్ని సదుపాయాలతో కూడిన వసతిగృహాలు సిద్ధం చేయాలని సూచించారు.

తెలంగాణ వైద్యవిద్య విప్లవం దిశగా అడుగులు వేస్తోందని, వైద్యవిద్యకు హబ్‌గా మారుతోందని హరీశ్‌రావు అన్నారు. మారుమూల జిల్లాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఆయన అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ విధానం ప్రకటించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. 

బోధన సిబ్బంది అంశం కొలిక్కి..

రాష్ట్రంలో తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వీలుగా కళాశాలలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా తొమ్మిది వైద్య కళాశాలను ప్రారంభించడం ద్వారా 900 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, జనగాం, సిరిసిల్ల, నిర్మల్, ఆసిఫాబాద్‌లలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలంటే జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) అనుమతించాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ బృందాలు బోధన సిబ్బంది నియామకం, వసతులపై అసంతృప్తి వ్యక్తంచేశాయి. మొదటిసారి పరిశీలించినప్పటి పరిస్థితులే తాజాగా వచ్చినప్పుడూ ఉన్నాయని రెండోసారి తనిఖీల సందర్భంగా గుర్తుచేశాయి. దాంతో ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2815 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలు ప్రారంభమైతే మరో 900 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ మూడోసారి కొత్త వైద్య కళాశాలల తనిఖీకి వచ్చేలోపు బోధనా సిబ్బంది నియామకం, వసతుల కల్పన సహా కీలక అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 24 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా వాటిలో 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.

తొమ్మిది వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఇందులో భాగంగా 87 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చారు. అలాగే 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించే అంశంపైనా దృష్టి సారించారు. 1,442 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియనూ కొలిక్కి తెచ్చారు. అయితే... మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతుండటంతో మంత్రి సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే నీట్ ఎంబీబీఎస్ ప్రకటన వెలువడింది. అడ్మిషన్ల ప్రక్రియ దశకు రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండటంతో అంతలోపు కొత్త వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Published at : 29 Mar 2023 10:34 AM (IST) Tags: Minister Harish Rao Education News in Telugu New Medical colleges in Telangana TS Medical Colleges Medical Colleges Classes

సంబంధిత కథనాలు

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్