Union Budget 2023: ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం, విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు!
దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'నేషనల్ డిజిటల్ లైబ్రరీలు' ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా అయిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతముందు బడ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం ఉన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినట్లు ఆమె పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'నేషనల్ డిజిటల్ లైబ్రరీలు(NDL)' ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నాణ్యమైన పుస్తకాల లభ్యత కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పంచాయతీ, వార్డు స్థాయిల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలను ఎంకరేజ్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. పిల్లలకు నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని ప్రాంతీయ భాషల్లో మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి తేనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
The government proposes to set up a national digital library for facilitating the availability of quality books
— PIB India (@PIB_India) February 1, 2023
States will be encouraged to set up physical libraries at panchayat and ward levels and provide infrastructure for accessing the national digital library resources pic.twitter.com/ZKkcR6EVaw
ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు. గిరిజన విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
#Budget2023
— PIB India (@PIB_India) February 1, 2023
In the next three years the center will recruit 38,800 teachers and support staff for the 740 Eklavya Model Residential Schools serving 3.5 Lakh tribal students: Finance Minister @nsitharaman #AmritKaalBudget #UnionBudget2023 pic.twitter.com/ntI64Voanp
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.
ఉపాధి అవకాశాలను పెంపొందించాలనేది టార్గెట్ -నిర్మలా సీతారామన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు దాదాపు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ . ఉపాధి అవకాశాలను పెంపొందించాలనేది ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. భారతదేశం నుండి G20 అధ్యక్ష పదవి ఒక పెద్ద అవకాశం. ఇది భారతదేశ బలాన్ని చూపుతుందన్నారు నిర్మలా సీతారామన్.
యువత కోసం స్కిల్ యూత్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలని కలలు కనే విద్యార్థుల కోసం 30 స్కిల్ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నేరుగా సహాయం అందించబడుతుంది. ఫిన్‌టెక్ సేవలు పెంచబడతాయి, డిజి లాకర్ యుటిలిటీ చాలా పెరుగుతుంది మరియు ఇది అన్ని డిజిటల్ పత్రాలను కలిగి ఉంటుంది.
Also Read:
వచ్చే ఏడాది పాటు ఉచిత రేషన్ - బడ్జెట్ 2023లో ప్రకటించిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023-2024 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేదలకు పెద్ద ఉపశమనం కలిగించారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)ను ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు చెప్పారు. అంటే వచ్చే ఏడాది పాటు ప్రజలకు ఉచిత రేషన్ అందుతుంది.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ 2023- రైతులపై స్పెషల్ ఫోకస్
ఎన్నో ఆకాంక్షలు, మరెన్నో ఆశలతో కూడుకున్న బడ్జెట్ 2023 ప్రజల ముందుూకు రానే వచ్చింది. 7 అంశాలపై ఫోకస్ పెడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే భారత్...తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..
బడ్టెట్ 2023 కోసం క్లిక్ చేయండి..