అన్వేషించండి

CUK UG Courses: 'సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక'లో యూజీ కోర్సులు, ప్రవేశం ఇలా

Karnataka CUK UG Courses: కర్ణాటక రాష్ట్రం కలబురిగి(గుల్బర్గా)లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక (కేసీయూ) 2024-25 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Central University of Karnataka: కర్ణాటక రాష్ట్రం కలబురిగి(గుల్బర్గా)లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక (CUK) 2024-25 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. సీయూఈటీ యూజీ-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మార్చి 26తో ముగియనుంది. తెలంగాణలోని 16 జిల్లా కేంద్రాల్లో సీయూఈటీ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుతో సహా 13 భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 31 మధ్య కంప్యూటర్‌ ఆధారిత విధానంలో సీయూఈటీ యూజీ పరీక్ష నిర్వహిచనున్నారు. 

వివరాలు..

* సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక - యూజీప్రవేశాలు

కోర్సులు..

* అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

➦ బీఎస్సీ (ఫిజిక్స్ & కెమిస్ట్రీ)

➦ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్ & జియోలజీ)

➦ బీఎస్సీ/ బీఏ (సైకాలజీ & ఇంగ్లిష్)

➦ బీఎస్సీ/బీఏ (జియోగ్రఫీ & హిస్టరీ)

➦ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)

➦ బీఎస్‌డబ్ల్యూఏ/ బీఏ(ఎకనామిక్స్  & సోషల్ వర్క్)

➦ బీబీఏ

➦ బీఈడీ

➦ బీటెక్ (మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్)

➦ బీటెక్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్)

➦ బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)

అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: సీయూఈటీ (యూజీ)-2024 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపుంపరే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపర్తి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్‌నగర్.

ముఖ్యమైన తేదీలు..

➸ సీయూఈటీ  యూజీ -2024 నోటిఫికేషన్:  27.02.2024.

➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2024.

➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.03.2024  (రాత్రి 11:50 వరకు).

➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.03.2024  (రాత్రి 11:50 వరకు).

➸ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్: 28.03. 2024 - 29.03.2024 (రాత్రి 11:50 వరకు).

➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: 30.04.2024 నుంచి.

➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2024.

➸ పరీక్ష ప్రారంభతేదీ: మే 15 నుండి మే 31, 2024 వరకు

➸ ఫలితాల ప్రకటన: 30.06.2024.

CUET Notification

CUK Courses

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget