CBSE 12th result 2024: 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.in, results.cbse.nic.in ఫలితాలను తెలుసుకోవచ్చు.
CBSE 12th result 2024: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు http://cbse.gov.in, results.cbse.nic.in ఫలితాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను విద్యార్థులు తమకు అందుబాటులో ఉంచుకోవాలి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రూల్ నెంబరు, స్కూల్ నెంబరు, అడ్మిట్ కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..
10వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. 16,33,730 విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరైనట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఇక పరీక్ష రాసిన వారిలో 14,26,420 మంది పాస్ అయినట్టు పేర్కొంది. 12వ తరగతిలో మొత్తం 87.98శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 91.52శాతం ఉత్తీర్ణత సాధించగా, 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు రాగా ఇందులో 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ఈ క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్, జవాబు పత్రాల స్కాన్ షెడ్యూల్‌ని విడుదల చేసింది. సీబీఎస్ఈ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం తమ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్, జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం నిర్ణీత షెడ్యూల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలంటే, విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పేపర్ల ఆధారంగా మార్కులతోపాటు, ఉత్తీర్ణతను నిర్ధారిస్తారు. ఒక అభ్యర్థి రెండు అసెస్‌మెంట్‌లను కలిగి ఉన్న సందర్భంలో ఉత్తీర్ణత సాధించడానికి ఒక సబ్జెక్టులోని థియరీ, ప్రాక్టికల్‌లో 33 శాతం చొప్పున మార్కులను తప్పనిసరిగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌లో “E” లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్స్ సాధించిన విద్యార్థులకు మాత్రమే పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ అభ్యర్థి ఫెయిల్ అయితే అతన్ని ఫలితాన్ని నిలిపివేస్తారు. ఇలా ఒక సంవత్సరం మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక అభ్యర్థి ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఎక్స్‌టర్నల్ పరీక్షలలోని 5 సబ్జెక్టుల్లో ఒకదాంట్లో ఫెయిల్ అయితే, సంబంధింత సబ్జెక్ట్ కోసం సదరు అభ్యర్థిని కంపార్ట్‌మెంటల్‌గా పరిగణిస్తారు.
వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు..
నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడాదికి రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించనుంది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది (2025-26 విద్యాసంవత్సరం) ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేయనున్నారు. దీనికనుగుణంగా సెమిస్టర్ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తులు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సీబీఎస్‌ఈని ఈ మేరకు కోరింది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చేనెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించే విధంగా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.