By: ABP Desam | Updated at : 03 Aug 2021 03:01 PM (IST)
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. ఈ ఏడాది 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు. బాలుర కంటే 0.35 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 99.24 కాగా.. బాలుర ఉత్తీర్ణత 98.89 శాతంగా నమోదైంది. ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
త్రివేండ్రం టాప్..
ప్రాంతాల వారీగా చేస్తే.. ఫలితాల్లో త్రివేండ్రం టాప్ ప్లేస్‌లో నిలిచింది. 99.99 శాతం ఉత్తీర్ణతను సాధించింది. రెండో స్థానాన్ని బెంగళూరు (99.96 శాతం) దక్కించుకోగా.. తర్వాతి స్థానాల్లో చెన్నై (99.94 శాతం), పుణె (99.92 శాతం), అజ్మీర్ (99.88 శాతం) ఉన్నాయి. సీబీఎస్ఈ 12 ఫలితాల మాదిరిగానే 10 ఫలితాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.
సీబీఎస్ఈ 10 ఫలితాలను cbseresults.nic.in, cbse.gov.in వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిజిలాకర్ (DigiLocker) యాప్, ఉమాంగ్ (UMANG) యాప్, digilocker.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఫలితాలు లింక్‌లు ఇవే..
లింక్ 1
లింక్ 2
లింక్ 3
ఫలితాలు చెక్ చేసుకోండిలా..
1. cbseresults.nic.in. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. అందులో 'Class X Result' పై క్లిక్ చేయండి.
3. మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి.
4. స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోండి.
సీబీఎస్ఈ ట్వీట్..
సీబీఎస్ఈ 10 ఫలితాలు జూలై 20వ తేదీన విడుదల కావాల్సి ఉంది. స్కూళ్లు మార్కుల జాబితాలను పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల ఆలస్యం అయింది. ఫలితాల విడుదలపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగాలను బోర్డు తెరదించింది. నేడు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది.
Dear Students
— CBSE HQ (@cbseindia29) August 3, 2021
Results can be accessed on https://t.co/JfDBA2YU8F or https://t.co/9z38Le7QWU or DigiLocker
Find your Roll Number using the Finder on https://t.co/1RMO8azHpP #CBSEResults #CBSE pic.twitter.com/vxdP1NFcLJ
CBSE Class X Results to be announced today at 12 Noon.#CBSEResults #CBSE pic.twitter.com/LJU1MUaB4Z
— CBSE HQ (@cbseindia29) August 3, 2021
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువవుతోన్న నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గత వారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కాగా.. మొత్తం 99.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. గతేడాది 88.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణతా శాతం.. ఈసారి పెరిగింది. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే 0.54 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 99.13గా ఉండగా.. బాలికలది 99.67 శాతంగా నమోదైంది.
APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు
TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!
GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?
TS SSC Exam Hall Tickets: పదోతరగతి హాల్టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం