అన్వేషించండి

BITSAT: బిట్‌శాట్‌- 2025 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా

BITS Pilani BITSAT-2025: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్) నిర్వహించే బిట్‌శాట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పిస్తారు.

BITS Pilani BITSAT-2025 Notification: రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆయా క్యాంపస్‌లలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18తో ముగియనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 29 నుంచి మే 01 వరకు దరఖాస్తుల సవరణరకు అవకాశం కల్పిస్తారు. మే 26 నుంచి 30 వరకు బిట్‌శాట్ (సెషన్-1), జూన్ 22 నుంచి 26 వరకు బిట్‌శాట్ (సెషన్-2) పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు...

⫸ బిట్‌శాట్ - 2025 ప్రవేశ ప్రకటన

➜ క్యాంపస్‌లవారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం:

I. బిట్స్‌పిలానీ- పిలానీ క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.

➥ బీఫార్మసీ

➥ ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

➥ ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.

II. బిట్స్ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.

ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

III. బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.

➥ బీఫార్మసీ

➥ ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: 

సెషన్-1 మాత్రమే ఇండియన్ మరియు నేపాల్ అభ్యర్థులకు రూ.3500(పురుషులకు); రూ.3000(మహిళలు/ట్రాన్స్ జెండర్); దుబాయ్ పురుషులు/ మహిళలు/ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.7150.

సెషన్-1&2 పరీక్షలకు కలిపి ఇండియన్ మరియు నేపాల్ అభ్యర్థులకు రూ.5500 (పురుషులకు); రూ.4500 (మహిళలు/ట్రాన్స్ జెండర్); దుబాయ్ పురుషులు/ మహిళలు/ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.9150.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: బిట్‌శాట్-2024 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

పరీక్ష విధానం: బిట్‌శాట్‌-2024 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.04.2025.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 29.04.2025 - 01.05.2025 వరకు.

➥ బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ (సెషన్-1) తేది: 26- 30.05.2025.

➥ బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ (సెషన్-2) తేది: 22 -26.06.2025.

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Leopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP DesamSunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABPSunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP DesamNikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Sunitha And Wilmore Latest News: సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
Reverse Digital Arrest: డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
TTD News:  శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
Embed widget