అన్వేషించండి

APTET 2024: ఆ 'టెట్' అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఒకే ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయింపు

APTET: టెట్ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

AP-TET JULY-2024: ఆంధ్రప్రదేశ్‌లో 'టెట్' పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. వేర్వేరు సెంటర్లలలో పరీక్ష రాయడానికి పడుతున్న అభ్యర్థుల ఇబ్బందుల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయిస్తూ.. ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక ఫోన్ నెంబర్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఏమైనా సందేహాలుంటే 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995649286, 7995649286, 9963069286, 9398822618 ఫోన్‌ నంబర్లలో లేదా ఈమెయిల్‌ grievenes.tet@apschool.in ద్వారా సంప్రదించవచ్చు.

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) అక్టోబరు 3 నుంచి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అయితే కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. హాల్‌టికెట్లనూ వేర్వేరుగా విడుదల చేశారు. దీంతో ఆ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. రెండు పరీక్షలూ ఒకేసారి రాయడం సాధ్యం కాదుకాబట్టి ఏదో ఒక పరీక్ష వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అక్టోబరు 3 నుంచి టెట్ పరీక్షలు.. 
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 3 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దసరా పండుగకు సంబంధించి అక్టోబర్ 11, 12 తేదీలు మినహా అక్టోబర్ 21 వరకు రెండు షెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలు మాత్రం పరీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచి అంటే.. అక్టోబర్‌ 4 నుంచి విడుదల చేస్తారు. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 27న ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదల చేసి, నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలు..
తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పక్క రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర వాసులకు ఒడిశా, రాయలసీమ వారితో పాటు సమీపంలో ఉన్న వారికి బెంగళూరు, చెన్నై, మరికొంత మందికి హైదరాబాద్, ఖమ్మం వంటి సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

APTET 2024: ఆ 'టెట్' అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఒకే ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయింపు

పరీక్ష విధానం:

➥  ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.

➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

కేటగిరీలవారీగా అర్హత మార్కులు..
ఏపీ టెట్ పరీక్షలో అర్హత మార్కులను ఓసీ(జనరల్‌) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Harsha Sai: నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Dhruv Vikram New Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Harsha Sai: నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Dhruv Vikram New Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Malayalam Actor Siddique: పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
Lavanya Tripathi : వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
Embed widget