KU SDLCE: కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ డిస్టెన్స్ & ఆన్‌లైన్ ఎడ్యుకేషన్' దూరవిద్య విధానంలో వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
KU Centre for Distance and Online Education Admissions: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ డిస్టెన్స్ & ఆన్‌లైన్ ఎడ్యుకేషన్' ఫిబ్రవరి 2024, అకడమిక్ సెషన్‌కు సంబంధించి దూరవిద్య విధానంలో వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభంకాగా.. మార్చి 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు రూ.300 ఆలస్యరుసుముతో మార్చి 30 వరకు దరఖాస్తుచేసుకునే అవకాశం కల్పించారు.
వివరాలు..
* కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య ప్రవేశాలు - 2024
1) డిగ్రీ కోర్సులు
- బీఏ
- బీకాం (జనరల్)
- బీకాం (కంప్యూటర్స్)
- బీబీఏ
- బీఎస్సీ (మ్యాథ్స్
- స్టాటిస్టిక్స్
- కంప్యూటర్ సైన్స్)
- బీఎల్‌ఐఎస్సీ.
వ్యవధి: మూడేళ్లు.
2) పీజీ కోర్సులు
- ఎంఏ (తెలుగు/ ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ హిస్టరీ/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ రూరల్ డెవలప్‌మెంట్/ సోషియాలజీ)
- ఎంకాం
- ఎంఎస్‌డబ్ల్యూ
- ఎంఏ జేఎంసీ
- ఎంఎల్‌ఐఎస్సీ
- ఎంఎస్సీ (సైకాలజీ/ మ్యాథ్స్/ ఎన్విరాన్‌మెంటర్ సైన్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ జువాలజీ/ ఫిజిక్స్).
వ్యవధి: రెండేళ్లు.
3) డిప్లొమా కోర్సులు
విభాగాలు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్ సి స్కిల్స్/ యోగా/ డిజాస్టర్ మేనేజ్‌మెంట్.
వ్యవధి: ఒక ఏడాది
4) ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్
విభాగాలు: మిమిక్రీ/ ఓకల్ మ్యూజిక్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ మ్యూజిక్/ సాఫ్ట్ స్కిల్స్/ మీడియా ఫొటోగ్రఫీ
వ్యవధి: 3 నెలలు
5) సర్టిఫికేట్ ప్రోగ్రామ్
విభాగం: లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్.
వ్యవధి: 6 నెలలు
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.03.2024.
➥ రూ.300 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 30.03.2024.
Online Admission Registration Application Form
ALSO READ:
టీఎస్ పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల ప్రారంభంకాలేదు. ఫిబ్రవరి 28 నుంచి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.300 తత్కాల్ ఫీజు కింద ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడాది మే 17న టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పాలిసెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..