అన్వేషించండి

APPECET: ఏపీ పీఈసెట్ – 2024 దరఖాస్తు ప్రారంభం, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పుడంటే?

ఏపీలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 28న ప్రారంభమైంది. అభ్యర్థులు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP PECET 2024 Application: ఏపీలోని బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2024 నోటిఫికేష‌న్ మార్చి 25న విడుద‌లైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 28న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.500 ఆల‌స్య రుసుముతో మే 22 వ‌ర‌కు, రూ.1000 ఆల‌స్య రుసుముతో మే 29 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల సవరణకు మే 30, 31 తేదీల్లో అవకాశం కల్పించనున్నారు. జూన్ 4 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11 నుంచి ఫిజిక‌ల్ టెస్టులు, గేమ్ స్కిల్ టెస్టులు నిర్వహించ‌నున్నారు. టెస్టులు పూర్తయిన వారంరోజులకు ఫలితాలను వెల్లడించనున్నారు. గుంటూరులోని ఆచార్యనాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈవెంట్లు నిర్వహించనున్నారు.

వివరాలు...

* ఏపీ పీఈసెట్ – 2024 (AP PECET 2024)

అర్హత: బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2024 నాటికి బీపీఈడీ కోర్సుకు 19 సంవత్సరాలు, డీపీఈడీ కోర్సుకు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇదివరకే పీఈటీలుగా పనిచేస్తున్న అభ్యర్థులు ఏపీపీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు సంబంధిత డీఈఓల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్- రూ.900, బీసీ-రూ.800, ఎస్సీ-ఎస్టీలకు రూ.700.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 25.03.2024

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2024

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.05.2024

➥ రూ.500 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 22.05.2024.

➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 29.05.2024

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.05.2024 & 31.05.2024

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 04.06.2024 నుంచి.

➥ ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష తేది (ఫిజికల్ ఈవెంట్స్): 11.06.2024 నుంచి.

రిపోర్టింగ్ సమయం: ఉదయం 6 గంటలు.

ఈవెంట్స్ ప్రారంభం: ఉదయం 7 గంటల నుంచి.

వేదిక: A.N.U. Campus, Guntur.

Notification

Online Application

Fee Payment

Instruction Booklet

Website

ALSO READ:

APRCET- 2023- 2024: ఏపీఆర్‌సెట్‌ - 2024 దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని 17 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET- 2023- 2024)' దరఖాస్తు గడువును రూ.2,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 3 వరకు, రూ.5,000 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 6 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ డా.బి.దేవప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ డా.హేమచంద్రారెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్‌ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, మే 2 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget