AP SSC Reverification Results 2024: ఏపీ పదోతరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి, ఇలా చూసుకోండి
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను అధికారులు మే 23న విడుదలచేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్‌లను అందుబాటులో ఉంచారు.
AP SSC Results Revaluation 2024 Results: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను అధికారులు మే 23న విడుదలచేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్‌లను అందుబాటులో ఉంచారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్స్ లాగిన్‌లో వివరాలు నమోదచేసి ఫలితాలు చూసుకోవచ్చు. మే 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం 55,966 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం లాగిన్ వివరాలు నమోదుచేసే ముందు పాఠశాలల ప్రిన్సిపల్స్ యూజన్ మాన్యువల్ చూడాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: dir_govexams@yahoo.com ద్వారా సంప్రదించవచ్చు.
AP పదోతరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ పదోతరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి.-https://bse.ap.gov.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'RV /RC March 2024 Result in School Login' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ కోడ్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
➥ వివరాలు నమోదుచేయగానే Login బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ స్ట్కిప్ట్‌లు కనిపిస్తాయి.
➥ ఆన్సర్ స్ట్కిప్ట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం ఉపయోగించుకోవాలి.
Click here to Read User Manual
పదోతరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు:
ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) పరీక్షలను మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఏవైనా తప్పులుంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించపు గడువు ముగియగా.. రూ.50 ఆలస్య రుసుముతో మే 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పాఠశాలలవారీగా పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ మే 24: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1
➥ మే 25: సెకండ్ ల్యాంగ్వేజ్
➥ మే 27: ఇంగ్లిష్
➥ మే 28: మ్యాథమెటిక్స్
➥ మే 29: ఫిజికల్ సైన్స్
➥ మే 30: జీవ శాస్త్రం
➥ మే 31: సోషల్ స్టడీస్
➥ జూన్ 1న: కాంపోజిట్ విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష
➥ జూన్ 3న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష.