అన్వేషించండి

APRS CAT 2024: ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు.

APR Schools Admission Notification 2024: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం 'ఏపీఆర్‌ఎస్ క్యాట్-2024' నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభంకాగా.. విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్‌ 8న, రెండో జాబితాను జూన్‌ 16న, మూడో జాబితాను జూన్‌ 23న ప్రకటించనున్నారు. 

వివరాలు...

* ఏపీఆర్‌ఎస్ క్యాట్-2024

సీట్ల సంఖ్య: 5వ తరగతి-3920 సీట్లు. 6-8వ తరగతులు-575 సీట్లు ఉన్నాయి.

అర్హతలు..

➥ 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2013 - 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి.

➥ 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2012 - 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.

➥ 7వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 - 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.

➥ 8వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2010 - 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.

➥  జనరల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఓసీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్, మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చు.

➥ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు. తెల్లరేషన్ కార్డు ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి వర్తించదు.

ALSO READ: APRJC CET - 2024: ఏపీఆర్‌జేసీ సెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

దరఖాస్తు ఫీజు: రూ.100. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 31.03.2024.

➥ హాల్‌టికెట్ల విడుదల: 17.04.2024.

➥ పరీక్షతేది: 25.04.2024. (10.00 AM to 12 PM)

➥ ఎంపికైన విద్యార్థుల మొదటి జాబితా వెల్లడి: 14.05.2024.

➥ ఎంపికైన విద్యార్థుల రెండో జాబితా వెల్లడి: 21.05.2024.

➥  ఎంపికైన విద్యార్థుల రెండో జాబితా వెల్లడి: 28.05.2024.

Notificaion

Online Application (5th Class)

Online Application (6th, 7th, 8th Class)

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Embed widget