By: ABP Desam | Updated at : 10 Feb 2022 04:04 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి, ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటించారు. మార్చి నెలలో 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీలో మొత్తం 6,39,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఇదే పదోతరగతి షెడ్యూల్:
మే 02(సోమవారం)- ఫస్ట్ లాంగ్వేజ్
మే 04(బుధవారం )- సెకండ్ లాంగ్వేజ్
మే 05(గురువారం)-ఇంగ్లీష్
మే 07(శనివారం)- గణితం
మే 09(సోమవారం)-ఫిజికల్ సైన్స్
మే 10(మంగళవారం)బయోలాజికల్ సైన్స్
మే 11(బుధవారం)సోషల్ స్టడీస్
మే 12(గురువారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2(కాంపోజిట్ కోర్స్/ఓఎస్‌ఎస్‌సీఎన్ఈన్ లాంగ్వేజ్) పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
మే 13(శుక్రవారం) ఓఎస్‌ఎస్‌సీఎన్ఈన్ లాంగ్వేజ్ పేపర్ 2(సంస్కృతం, అరబిక్, పర్షియన్)/ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్స్ థియరీ
KNRUHS: కటాఫ్ స్కోర్ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్
MANAGE: మేనేజ్లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు, వివరాలు ఇలా
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు, ఈ అర్హతలుండాలి
Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్ చెయ్యొచ్చు
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్ను అప్డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>