AP ICET Result 2021 Live Updates: నేడే ఏపీ ఐసెట్ ఫలితాల విడుదల .. రిజల్ట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
ఆంధ్రప్రదేశ్‌లో ఐసెట్ ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. ఫలితాల లైవ్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తాజా అప్‌డేట్ల కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తుండండి.
Background
ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 1) వెలువడనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 17, 18 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించింది. విద్యార్థులు తమ ఫలితాలను sche.ap.gov.in లో చూడవచ్చు.
ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
1. APICET అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.inను ఓపెన్ చేయండి.
2. APICET 2021 అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
3. దీంతో మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ APICET 2021 రిజల్ట్ అని ఉన్న దానిని ఎంచుకోండి.
4. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి.
5. వ్యూ రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పరీక్ష ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
6. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.
సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన డిపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 99 శాతం మంది హాజరైనట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు.





















