అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP ICET 2024: నేడు ఏపీ ఐసెట్ పరీక్ష, హాజరుకానున్న 48 వేలకుపైగా విద్యార్థులు - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP ICET: ఏపీఐసెట్-2024 పరీక్ష (AP ICET) మే 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) ఐసెట్ పరీక్షల బాధ్యత చేపట్టింది.

APICET 2024 Exam: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు మే 6న ఏపీఐసెట్-2024 పరీక్ష (AP ICET) పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. మే 8న ప్రిలిమినరీ కీ, జూన్‌ 20న ఐసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అందబాటులో విడుదల చేశారు. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2024 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) ఐసెట్ పరీక్షల బాధ్యత చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,938 మంది అమ్మాయిలు, 18,890 మంది అబ్బాయిలు ఉన్నారు. పరీక్ష కోసం ఏపీలో 111 పరీక్ష కేంద్రాలు, తెలంగాణలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 

➥ పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు). ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించారు. ఇక రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు, అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. తాజాగా పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. మే 6, 7 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

ఏపీ ఐసెట్-2024 ముఖ్యమైన తేదీలు: 

► ఏపీఐసెట్-2024  నోటిఫికేషన్:  03.03.2024.

► దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06.03.2024. 

► దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 07.04.2024.

► రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 08.04.2024 - 12.04.2024.

► రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 13.04.2024 - 17.04.2024.

► రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 18.04.2024 - 22.04.2024.

► రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 23.04.2024  - 27.04.2024.

► దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 28.04.2024 - 29.04.2024.

► పరీక్ష హాల్‌టికెట్లు: 02.05.2024 నుంచి అందుబాటులో. 

► ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: 06.05.2024.

పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.30 PM to 05.00 PM

► ప్రిలిమినరీ ఆన్సర్ కీ: 08.05.2024 – 06.00 PM

► ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 10.05.2024 – 06.00 PM

► ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: 20.06.2024

Notification

Detailed Notification

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget