అన్వేషించండి

AP EAPCET Hall Ticket: ఏపీ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే? పరీక్షల షెడ్యూలు ఇలా

AP EAMCET: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్-2024 హాల్‌టికెట్లను విద్యార్థులు మే 7 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

AP EAPCET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్-2024 (AP EAPCET) పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు మే 7 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 16 నుండి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ పరీ ద్వారా 2024-25 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

పరీక్ష విధానం..

➥ ఏపీ ఈఏపీసెట్‌-2024 పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. 

➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. 

➥ మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. 

➥ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ఇందులో బోటనీ నుంచి 40 ప్రశ్నలు, జువాలజీ నుంచి 40 ప్రశ్నలు, ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. 

➥ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 మార్కులుగా నిర్ణయించారు. 

దరఖాస్తుల సవరణ ప్రారంభం..
ఏపీ ఈఏపీసెట్-2024 దరఖాస్తు సవరణ మే 4న ప్రారంభమైంది. విద్యార్థులు తమ వివరాల్లో ఏమైనా తప్పులుంటే మే 6 వరకు మార్చుకోవచ్చు. విద్యార్థులు తమ పేరు, తండ్రిపేరు, విద్యార్హతలు, ఇతర వ్యక్తిగత వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

ఆలస్యరుసుముతో 12 వరకు దరఖాస్తుకు అవకాశం..
ఏపీ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యరుసుములేకుండా ఇప్పటికే ముగిసింది. ఇక రూ.500, రూ.1000 ఆలస్యరుసుముతో కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేకపోయినవారు రూ.5000 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.  కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఏపీ ఎప్‌సెట్ దరఖాస్తు వివరాల సవరణ కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు..

అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు: 16.05.2024 - 17.05.2024

ఇంజినీరింగ్ విభాగాలకు: 18.05.2024 - 23.05.2024.

Notification

Online Application

Fee Payment for AP EAPCET - 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget