AP DEECET Result: ఏపీ డీఈఈసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 12, 13 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ జూన్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ డీఈఈసెట్ ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలను జూన్ 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్లను జూన్ 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. సంబంధిత డైట్ కళాశాలల్లో జూన్ 31 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
పరీక్ష ఇలా: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు-60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు-40 ప్రశ్నలు అడిగారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఇచ్చారు.
డీఈఈసెట్-2023 ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇలా!
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) జూన్ 19న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భారీగా పెరిగిన 'జేఈఈ అడ్వాన్స్‌డ్' కటాఫ్ మార్కులు, వివరాలు ఇలా!
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చిన కటాఫ్ మార్కులు ఈసారి మాత్రం భారీగా పెరిగాయి. 2021లో 360 మార్కులకు కటాఫ్ 63 మార్కులుగా, 2022లో 360కి 55 మార్కులుగా ఉంది, అయితే ఈసారి కటాఫ్ మార్కులు ఏకంగా 86కు పెరగడం విశేషం. 2021, 22 సంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యార్థులు తగినంత ప్రతిభ చూపలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి పరీక్ష కఠినంగా ఉందని భావించినప్పిటికీ.. అందుకు భిన్నంగా విద్యార్థలు మార్కులు సాధించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..