AP Tenth Topper: ఈ 'మనస్వి' చదువుల తపస్వి - 600కు 599 మార్కులతో 'టెన్త్' ఫలితాల్లో సరికొత్త రికార్డు
AP 10th Class Topper: ఏపీలో పదోతరగతి ఫలితాలు ఏప్రిల్ 22న వెలువడ్డాయి. ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కులకు గాను.. 599 మార్కులు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
AP SSC Results Topper: ఏపీలో పదోతరగతి ఫలితాలు ఏప్రిల్ 22న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. అయితే ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఇదివరకెప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డు సాధ్యమైంది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పదోతరగతి ఫలితాల్లో ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కులకు గాను.. 599 మార్కులు సాధించింది. ఇప్పుడు ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మొగిపోతోంది.
మనస్వికి సాధించిన మార్కులు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఒక్క సెకండ్ లాంగ్వేజీలో తప్ప.. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. స్టేట్ టాపర్‌గా ( State Topper ) నిలవడంతో మనస్వి సంతోషానికి అవధులు లేకుండా పోాయాయి. సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వస్తున్నాయి. మనస్వి లాంటి విద్యార్థినులు ఈ సమాజానికి ఎంతో అవసరమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మనస్వి ఫస్ట్ లాంగ్వేజ్‌లో 100కు 100, సెకండ్ లాంగ్వేజ్‌లో 100కు 99 మార్కులు, థర్డ్ లాంగ్వేజ్‌లో 100కు 99 మార్కులు సాధించింది. ఇక మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జె్క్టులలోనూ 100కు 100 మార్కులు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది.
మనస్వి సాధించిన మార్కులు ఇలా..
సబ్జెక్టు | సాధించిన మార్కులు |
ఫస్ట్ లాంగ్వేజ్ | 100 |
సెకండ్ లాంగ్వేజ్ | 99 |
థర్డ్ లాంగ్వేజ్ | 100 |
మ్యాథమెటిక్స్ | 100 |
సైన్స్ | 100 |
సోషల్ స్టడీస్ | 100 |
మొత్తం మార్కులు | 599 |
ఫలితాల్లో బాలికలదే హవా..
ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్ లో పాసయ్యారు. 5.66 శాతం మూడో క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 మంది ఎగ్జామ్ రాయగా, అందరూ పాసయ్యారు. పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.
పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 98.43 %, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 98.43 %, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 98.40 %, ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక సోషల్ వెల్ఫేర్ 94.55 %, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 %, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లు 89.46 %, కస్తూర్బా విద్యాలయాల్లో 88.96 %, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం, మున్సిపల్ హైస్కూల్స్‌లో 75.42 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల పూర్తిస్థాయి టైమ్‌టేబుల్‌ను అధికారులు వెల్లడించనున్నారు.
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఆన్‌లైన్ ద్వారానే..
అదేవిధంగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్ నుంచి మెమోలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
పదోతరగతి పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి..