అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP EdCET: ఏపీ ఎడ్‌సెట్‌ - 2024 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

AP EdCET 2024 Halltickets: ఏపీఎడ్‌సెట్-2024 పరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రాయూనివర్సిటీ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 8న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

AP EdCET 2024 Exam Halltickets: ఏపీలోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీఎడ్‌సెట్-2024 పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే జూన్ 18న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

AP EdCET 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం:

➥ మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు. 

➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.

➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత మార్కులు: ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా (37 మార్కులు) నిర్ణయించారు. ర్యాంకుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. అలాగే ఫిజికల్ సైన్సెస్/మ్యాథమెటిక్స్ మెథడాలజీ విభాగాలకు సంబంధించి మహిళలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. 

ఆంధ్రప్రదేశ్‌‌లోని ఎడ్‌సెట్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16న 'APEdCET-2024' నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 18 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత రూ.1000ల ఆలస్య రుసుముతో మే 19 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల సవరణ మే 22న ప్రారంభంకాగా.. మే 25 వరకు అవకాశం కల్పించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 30న విడుదల చేవారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 8న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు...

➥ AP EDCET 2024 నోటిఫికేషన్ వెల్లడి: 16.04.2024.

➥ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.04.2024.

➥  ఎడ్‌సెట్ దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.

➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 19.05.2024.

➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 21.05.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.05.2024  - 25.05.2024.

➥ ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.05.2024 నుంచి.
 
ఏపీ ఎడ్‌సెట్-2024 పరీక్ష తేది: 08.06.2024.

పరీక్ష సమయం: ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు.

➥ ఎడ్‌సెట్ ప్రిలిమినరీ కీ అప్‌లోడ్: 15.06.2024. 11-00 AM 

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 18.06.2024. 5.00 PM 

AP EDCET 2024 Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget