అన్వేషించండి

AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!

AP Inter Results 2026:ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన పబ్లిక్‌ పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌ 15 విడుదల చేయనుంది. ఉదయం పదిన్నరకు రిజల్ట్స్‌ను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్ 15న ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.
  • 10,57,899 మంది విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెలువడనున్నాయి.
  • అధికారిక వెబ్సైట్, వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
  • రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పించారు.

AP Inter Results 2026:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15న విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు ఉదయం సరిగ్గా 10.31 నిమిషాలకు తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. 

మంత్రి నారా లోకేష్‌ ఎక్స్ వేదికా కీలక సమాచారం షేర్ చేశారు. ఇంటర్ విద్యార్థుల నిరీక్షణ బుధవారంతో ముగుస్తుంది. విద్యార్థులందరికీ ఆల్‌ది బెస్ట్ అంటూ ఆయన సందేశాన్ని పోస్టు చేశారు. 

ఈ ఏడాది ఇంటర్‌  పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్ని ఏళ్లతో పోలిస్తే గణనీయంగా ఉంది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి ఏడాదికి చెందిన విద్యార్థులు 5, 31, 275 మంది విద్యార్థులు ఉండగా రెండో సంవత్సరానికి చెందిన వారు 5, 6, 264 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గణాంకాల్లో జనరల్‌ స్ట్రీమ్‌, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 96 శాతం నుంచి 98 శాతం వరకు నమోదు అయ్యారు. 

రిజల్ట్స్‌ను ఎలా చూసుకోవాలో స్టెప్‌ బై స్టెప్ తెలుసుకోండి!

ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్‌లపై ఒత్తిడి పెరిగి అవి మొరాయించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కోసం రెండు ప్రధాన మార్గాల్లో బోర్డు సూచించింది. 

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  resultsbie.ap.gov.in విజిట్ చేయండి. హాల్‌టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి. మీ సబ్జెక్టుల వారిగా మార్కులు, గ్రేడ్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్‌ అవసరాల కోసం మార్క్స్‌ మెమోను డౌన్‌లోడు చేసుకోండి. 

వాట్సాప్ ద్వారా మార్కులు ఇలా తెలుసుకోండి!

మన మిత్ర అనే వాట్సాప్ సేవ  ఉపయోగించి కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. 

మీ ఫోన్‌లో 9552300009 నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి. 

వాట్సాప్‌లో హాయ్ అనే మెసేజ్‌ను టైప్ చేసి పంపించండి. 

వెంటనే వచ్చే సూచనల ప్రకారం మీ హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సెకన్‌లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. 

రికౌంటింగ్ కోసం అవకాశం 

ఫలితాలు వచ్చిన తర్వాత కొందరు విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చు. అటువంటి వారు నిరాశ చెందాల్సిన పని లేదు. ప్రభుత్వం వారికి కింది అవకాశాలను కల్పిస్తోంది. తమ మార్కులపై నమ్మకం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై సబ్జెక్ట్‌కు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ వారం రోజుల్లోనే మొదలు కానుంది. మార్కులు పెంచుకోవాలనుకునే వారికి, లేదా ఉత్తీర్ణత సాధించని వారికి సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసిన మార్క్‌మెమో సరిపోతుందా?

ఇంటర్నెట్‌, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసిన మార్క్ మెమో కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇది అసలు సర్టిఫికెట్‌ కాదు. విద్యార్థులు తమ ఒరిజినల్‌ మార్క్స్‌ మెమో, ఇతర సర్టిఫికెట్ల కోసం మీ కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది. 

Frequently Asked Questions

AP ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేయబడతాయి?

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15న ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనుంది.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు?

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి ఏడాదికి 5,31,275 మంది, రెండో సంవత్సరానికి 5,06,264 మంది ఉన్నారు.

AP ఇంటర్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలను official website resultsbie.ap.gov.in లో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో చెక్ చేసుకోవచ్చు. అలాగే, 9552300009 నంబర్ కు వాట్సాప్ లో 'Hi' పంపి, సూచనల ప్రకారం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి కూడా తెలుసుకోవచ్చు.

రీకౌంటింగ్ లేదా సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉందా?

అవును, ఆశించిన మార్కులు రాని విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కులు పెంచుకోవాలనుకునే వారికి లేదా ఉత్తీర్ణులు కాని వారికి సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget