అన్వేషించండి

MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్‌ కోర్సు, పుస్తకాలు ఆవిష్కరించిన అమిత్‌ షా!

తొలిసారిగా వైద్యవిద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్‌‌లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. హిందీ మాధ్యమ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.

వైద్య విద్యను హిందీ మాధ్యమంలో కొనసాగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నంలో ముందడుగు పడింది. దేశ విద్యా వ్యవస్థలోనే చారిత్రక ఘట్టం మొదలైంది. తొలిసారిగా వైద్యవిద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్‌‌లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ మేరకు హిందీ మాధ్యమ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఇందులో భాగంగా అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పుస్తకాలు హిందీలో అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ మెడికల్ కళాశాల్లోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నారు.
 
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రధాని మోదీ కోరిక నెరవేరిందని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇది కీలకమైన రోజని అమిత్ షా అన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా దీన్ని అభివర్ణించారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రారంభించడాన్ని చారిత్మాత్మక నిర్ణయంగా  అమిత్ షా అభివర్ణించారు. 

ఇంగ్లిష్ భాషకు బానిసలుగా ఉండాలా? : సీఎం శివరాజ్ సింగ్ చౌహన్
అంతకుముందు సీఎం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. కాలేజీల్లో అడ్మిషన్ పొందగలిగే పేద పిల్లల జీవితాల్లో ఈ రోజు అమిత్ షా కొత్త ఉదయాన్ని తీసుకువచ్చారని.. ఇన్నాళ్లు వాళ్లంతా ఇంగ్లిష్ వలయంలో చిక్కుకున్నారని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. చాలా సార్లు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక చదువును వదిలేశారని అన్నారు. మనం ఎందుకు ఇంగ్లిష్ భాషకు బానిసలుగా ఉండాలని.. ప్రశ్నించారు. చైనీస్, జపనీస్, జర్మన్లు, ఫ్రెంచ్ వారు తమ భాషల్లోనే చదివి తమ ప్రతిభ చాటుకోగలిగితే.. మన పిల్లలు ఎందుకు అలా చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. 

ఇంగ్లిష్‌లో చదువుకోవాలంటే చదువుకోవచ్చని బలవంతం ఏం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 6 ఇంజినీరింగ్, 6 పాలిటెక్నిక్ కాలేజీల్లో హిందీని విద్యను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐఐటీ, ఐఐఎం హిందీ విద్యను ప్రారంభించాలనేది మా కల అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్ సిద్ధం చేసిన హిందీ పుస్తకాలను ఇతర రాష్ట్రాలతో పంచుకుంటానమ.. ఈ విషయమై అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం అవుతామని ఆయన అన్నారు.

ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదవని, ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని కారణంగా చాలా మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోలేకపోతున్నారని.. వారి కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ ను హిందీలో ప్రారంభిస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీలో నేర్చుకోలేమనే భావనను తొలగించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలమనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని అన్నారు. మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని సీఎం శివరాజ్ సింగ్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు. దేశంలో ఎంబీబీఎస్ కోర్సును హిందీలో తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిలిందన్నారు.


:: Also Read ::

Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశ్‌ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్‌ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబ‌రు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబ‌రులో సంప్రదించవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్‌ కోర్స్ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్పర్మేషన్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. 
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget