అన్వేషించండి

Telangana News: తెలంగాణ ఉన్నత విద్య ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీల దూకుడు - AISHE సర్వేలో

తెలంగాణలో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్‌రోల్‌మెంట్‌ గణనీయంగా పెరిగింది.

Telanaga Education News: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్‌రోల్‌మెంట్‌ గణనీయంగా పెరిగింది. ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (AISHE) సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు 6 శాతం పెరిగింది. గతంలో 34 శాతం ఉండగా.. 5 సంవత్సరాల్లో 40 శాతానికి చేరింది. ఇందులో పురుషుల నమోదు నాలుగు శాతం పెరిగి 34.7 శాతం నుంచి 38.5 శాతానికి, మహిళల నమోదు ఏకంగా 7 శాతం పెరిగి 34.1 శాతం నుంచి 41.56 శాతానికి చేరింది. ఎస్సీల మొత్తం నమోదు శాతం 30.4 శాతం నుంచి 39.2శాతానికి చేరగా, పురుషుల నమోదు 28.6శాతం నుంచి 35.6శాతానికి, మహిళల నమోదు 32.4శాతం నుంచి 42.9శాతానికి అంటే ఏకంగా 10 శాతం పెరిగింది.

ఎస్టీల నమోదు శాతాన్ని పరిశీలిస్తే మొత్తం నమోదు 28.4 శాతం నుంచి 38 శాతానికి చేరగా, పురుషుల నమోదు 30.2 శాతం నుంచి 39.1 శాతానికి, మహిళల నమోదు 26.6 శాతం నుంచి 36.9 శాతానికి చేరింది. జాతీయ సగటు జీఈఆర్‌ 28.4 శాతం, పురుషుల జీఈఆర్‌ 28.3, మహిళల జీఈఆర్‌ 28.5 శాతం మాత్రమే ఉంది. ఎస్సీ, ఎస్టీసహా మహిళల ఏ క్యాటగిరీలో తీసుకున్నా తెలంగాణ జాతీయ సగటు కన్నా ఉత్తమంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్నత విద్యలో మొత్తం నమోదు 2017-18లో 14.19 లక్షలు ఉండగా, 2021- 22కు వచ్చేసరికి 15.96 లక్షలకు చేరింది. అంటే 1.77 లక్షల నమోదు పెరిగింది. పురుషుల నమోదు 7.35 లక్షల నుంచి 7.93 లక్షలకు పెరిగితే మహిళల నమోదు 6.83 లక్షల నుంచి 8.03 లక్షలకు చేరింది.

ఎస్సీ విద్యార్థుల నమోదు 2017-18లో మొత్తం నమోదు 2.03 లక్షలుంటే 2021 -22లో 2.53 లక్షలకు చేరింది. పురుషుల నమోదు 98 వేల నుంచి 1.19 లక్షలకు చేరితే మహిళల నమోదు 1.05 లక్షల నుంచి 1.34 లక్షలకు చేరింది. ఎస్టీల నమోదు 2017-18 నుంచి 2021 – 22 మధ్యకాలంలో 1.06 లక్షల నుంచి 1.37 లక్షలకు, పురుషుల నమోదు 57 వేల నుంచి 72 వేలకు, మహిళల ఎన్‌రోల్‌మెంట్‌ 48వేల నుంచి 65వేలకు పెరిగింది. ఓబీసీల నమోదు 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో 5.96 లక్షల నుంచి 7.39 లక్షలకు చేరగా, పురుషుల నమోదు 3.03 లక్షల నుంచి 3.70 లక్షలకు, మహిళల నమోదు 2.92లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది.

సర్వేలో వెల్లడైన అంశాలు ఇలా..

➥ కళాశాలల సాంద్రత (కాలేజ్‌ డెన్సిటీ) పరంగా 18-23 ఏండ్ల మధ్య వయస్సుగల లక్ష జనాభాకు అత్యధిక కాలేజీలున్న రాష్ర్టాల్లో 66 కాలేజీలతో కర్ణాటక మొదటిస్థానంలో ఉన్నది. ఆ తర్వాత 52 కాలేజీలతో తెలంగాణ రెండోస్థానం, 49 కాలేజీలతో ఏపీ మూడోస్థానంలో ఉన్నది. ఈ విషయంలో జాతీయ సగటు కాలేజీల సంఖ్య 30 మాత్రమే.

➥ ఒక రాష్ట్రంలో అత్యధిక కాలేజీలున్న వాటిలో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ టాప్‌ 5లో నిలువగా, ఆ తర్వాత ఏపీ, గుజరాత్‌ తర్వాత తెలంగాణ 2,395 కాలేజీలతో 8వ స్థానంలో ఉన్నది.

➥ ఉన్నత విద్య నమోదులో తెలంగాణసహా పలు రాష్ర్టాల్లో పురుషులను వెనక్కినెట్టి మహిళలు దూసుకుపోతున్నారు. కేరళ, తెలంగాణ, హర్యానా, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, మేఘాలయ, చత్తీస్‌గఢ్‌లలో పురుషుల కన్నా.. మహిళల నమోదు అధికంగా ఉన్నది.

➥ కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే అత్యధికంగా నమోదుశాతం గల రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉన్నది. తమిళనాడు (47), హిమాచల్‌ప్రదేశ్‌ (43.1), ఉత్తరాఖండ్‌ (41.8), కేరళ (41.3), తెలంగాణ (40) రాష్ర్టాలు వరుసగా టాప్‌ 5 రాష్ట్రాల్లో నిలిచాయి.

➥ ఒక కాలేజీలో సగటు ఎన్‌రోల్‌మెంట్‌ తెలంగాణలో ఏటా పెరుగుతున్నది. 2017-18లో 558 మంది విద్యార్థులుండగా, 2018-19లో 554, 2019-20లో 545, 2020-21లో 556, 2021-22లో 611 మంది విద్యార్థులకు చేరింది.

➥ రాష్ట్రంలోని మొత్తం కాలేజీల సంఖ్య సైతం పెరుగుతున్నది. 2017-18లో రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య 2,045 కాగా, 2018-19లో 1,988, 2019-20లో 2,071, 2020-21లో 2,062, 2021, 22లో 2,083 కాలేజీలకు చేరింది.

2021-22 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నతవిద్య ప్రవేశాలు ఇలా..
➥ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో నమోదైన ప్రవేశాలు - మొత్తం 2,49,489 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా ఇందులో పురుషులు - 1,32,095, స్త్రీలు - 1,17,404 ఉన్నారు.

➥ ఇతర కాలేజీల్లో నమోదైన ప్రవేశాలు - మొత్తం 12,64,204 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా ఇందులో పురుషులు - 6,17,374, స్త్రీలు - 6,46,830 ఉన్నారు.   

➥ స్టాండ్ అలోన్ కాలేజీల్లో మొత్తం 82,987 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా ఇందులో పురుషులు - 43,894, స్త్రీలు - 39,093 ఉన్నారు.

➥ మొత్తంగా పరిశీలిస్తే.. 2021-22 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 15,96,680 ఎన్‌రోల్‌మెంట్లు నమోదుకాగా.. ఇందులో పురుషులు - 7,93,353, స్త్రీలు - 8,03,327 ఉన్నారు.

సామాజిక వర్గాలవారీగా చూస్తే..

కేటగిరీ పురుషులు స్త్రీలు మొత్తం
ఎస్సీ 1,19,137 1,34,691 2,53,828
ఎస్టీ 72,201 65,372 1,37,573
బీసీ  3,70,857 3,68,610 7,39,467
దివ్యాంగులు 2,371 1,618 3,989
ముస్లింలు 64,775 56,543 1,21,318
ఇతర మైనార్టీలు 4,036 5,531 9,567
ఈడబ్యూఎస్  10,800 10,724 21,524

 

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget