అన్వేషించండి

TS Polycet: పాలిటెక్నిక్‌‌లో 1,170 సీట్లు పెరిగాయోచ్! కౌన్సెలింగ్ షెడ్యూల్‌లోనూ మార్పులు!

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 1170 సీట్లను పెంచింది. 11 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతించింది.

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 1170 సీట్లను పెంచింది. 11 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక  విద్య, శిక్షణా బోర్డు వెల్లడించింది. ఈ మేరకు జులై 6న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అలాగే, పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లోనూ పలు మార్పులు చేసింది. జులై 7న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానుండటం, సీట్ల సంఖ్య పెరగడంతో ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసింది.

మారిన  షెడ్యూల్‌ ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 10న పాలిసెట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. జులై 8 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇక జులై 14న తుది విడత పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్లను కేటాయిస్తారు.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్..

TS Polycet: పాలిటెక్నిక్‌‌లో 1,170 సీట్లు పెరిగాయోచ్! కౌన్సెలింగ్ షెడ్యూల్‌లోనూ మార్పులు!
TS Polycet: పాలిటెక్నిక్‌‌లో 1,170 సీట్లు పెరిగాయోచ్! కౌన్సెలింగ్ షెడ్యూల్‌లోనూ మార్పులు!

ALSO READ:

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలు ఇలా!
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. జులై 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. జులై 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జులై 12 వరకు పొడిగించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా జులై 21 నుంచి ప్రారంభంకావాల్సిన రెండోవిడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 2 నుంచి ప్రారంభంకావాల్సిన తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లకు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్లతో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వగా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.. 

పాలిసెట్‌లో తొలిసారి స్లైడింగ్‌ విధానం! నచ్చిన బ్రాంచ్‌కు మారవచ్చు!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పాలిసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు పాలిసెట్లో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి స్లైడింగ్ నిర్వహిస్తారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
Epic Review : ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
Embed widget