పదేళ్లకే పదో తరగతి పాస్, యూపీ బాలుడి ఘనత!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదేళ్ల బాలుడు అయాన్ గుప్తా పదేళ్లకే పదో తరగతి పాసై చరిత్ర సృష్టించాడు. గతేడాది 9వ తరగతి, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను పూర్తిచేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదేళ్ల బాలుడు అయాన్ గుప్తా పదేళ్లకే పదోతరగతి పాసై చరిత్ర సృష్టించాడు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండే అయాన్ గుప్తా.. ఇంట్లో తన స్కూల్ పుస్తకాలను తిరిగేశాడు. అయితే ఒకే క్లాస్ పుస్తకాలు బోర్ అనిపించడంతో పై తరగతుల పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. బాలుడి టాలెంట్‌ను గుర్తించిన తల్లిదండ్రులు, స్కూల్ ప్రిన్సిపల్ లాక్‌డౌన్ అనంతరం అతడిని 9వ తరగతిలో జాయిన్ చేశారు.
గతేడాది 9వ తరగతి, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను పూర్తిచేశాడు. అంతేగాక 10వ తరగతి డిస్టింక్షన్‌లో పాసై చరిత్ర సృష్టించాడు. అయాన్‌కు మొత్తం 76.6 శాతం మార్కులు వచ్చాయి. హిందీలో 73 మార్కులు, ఇంగ్లిష్‌లో 74 మార్కులు, మ్యాథమెటిక్స్‌లో 82 మార్కులు, సైన్స్‌లో 83 మార్కులు, సోషల్ సైన్స్‌లో 78 మార్కులు, కంప్యూటర్ పేపర్‌లో 70 మార్కులను అయాన్ సాధించాడు.
అసాధారణ బాలుడైన అయాన్ 8వ తరగతి వరకు పుస్తకాలను ఇంట్లోనే చదువుకున్నాడని, లాక్‌డౌన్ అనంతరం బులంద్‌షహర్ జిల్లా జహంగీరాబాద్‌లో శివకుమార్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్‌తో మాట్లాడి 9వ తరగతిలో జాయిన్ చేశామని తల్లిదండ్రులు చెప్పారు. యూపీ ప్రభుత్వ నిబంధన ప్రకారం 14 ఏళ్లు నిండిన వారినే 10వ తరగతి పరీక్షలకు అనుమతిస్తారని, బాలుడి టాలెంట్ చూసి తాను అయాన్ 10 ఏళ్లకే పరీక్ష రాసేలా ప్రత్యేక అనుమతి తీసుకున్నానని ప్రిన్సిపల్ తెలిపారు.
Also Read:
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన వారికి మరో ఛాన్స్- ఇవాళే అప్లై చేయండీ
ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయనో... బాగా రాసినా మంచి ఫలితం రాలేదనో బాధపడుతున్న వాళ్లకు మరో అవకాశం. ఫలితాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా... అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు. ఇవాల్టి నుంచి మే 6 వరకు ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను బోర్డుకు విన్నవించుకోవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి కూడా అప్లై చేసుకోవాలంటున్నారు ఇంటర్ అధికారులు. రీ వెరిఫికేషన్‌లో ఫలితం ఆలస్యమైనా, లేకుంటే మొదటి లాంటి ఫలితమే వచ్చినా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసుకునే వీలుంటుంది అంటున్నారు. అందుకే ఎవరూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు అప్లై చేశామని ధీమాతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ అప్లై చేయడం నిర్లక్ష్యం వద్దంటున్నారు. వెబ్‌సైట్: https://bieap.apcfss.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..