అన్వేషించండి

YSRCP Leader Murder: వైసీపీ నేత దారుణహత్య - కారం చల్లి, వేట కొడవళ్లతో నరికిన దుండగులు

హిందూపురం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం జరిగింది. హిందూపురం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్యకు గురవడం పట్టణంలో కలకలం రేపుతోంది. తన ఇంటి ముందు కారులో దిగుతుండగా కళ్లల్లో కారం పొడి చల్లి, ఆపై వేట కొడవళ్ళతో నరికి  దారుణంగా హత్య చేశారు. ఆయన శరీరంపై 18 చోట్ల నరికిన కత్తిపోట్లు ఉన్నాయంటే ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. తన ఇంటి ముందే దారుణహత్యకు గురి కావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

అసలేం జరిగిందంటే..
వైసీపీ నేత రామకృష్ణారెడ్డి చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దులో దాబా నడుపుతున్నారు. రోజులాగే శనివారం రాత్రి సైతం దాబా మూసివేసి కారులో ఇంటికి చేరుకున్నారు. కారు డోర్ తెరిచి కిందకి దిగగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను చుట్టుముట్టారు. మొదట కళ్లల్లో కారం పొడి చల్లారు. ఆ వెంటనే తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో వైసీసీ నేత కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో వైసీపీ నేత అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

రెండు బైకులపై మొత్తం ఐదుగురు దుండగులు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు బైకులపై రెడీగా ఉండగా, మిగతా నిందితులు వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డిని విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. ఆయన శరీరంపై 18 చోట్ల నరికినట్లు తెలుస్తోంది. హత్య చేసిన వెంటనే నిందితులు అదే బైకులపై పరారయ్యారు. ప్లాన్ ప్రకారం హత్యకు రావడంతో నిందితులు తమను ఎవరూ గుర్తించకూడదని, ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉంది: కుటుంబం ఆరోపణలు
తన కుమారుడి హత్యకు కారణం ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన సహాయకుడు గోపి, చాకలి రవి, నంజుండ రెడ్డి, మురళి, కేపీ నాగుడు తదితరుల హస్తం ఉన్నట్లు మృతుడు రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్సీ పీఏపై రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. గ్రామీణ మండల సీఐ జీటీ నాయుడుపై జాతీయ బాలల హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేయడం, స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న రోజు గ్రామంలో జాతీయ పతాకం ఎగురవేసే విషయంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులకు, రామకృష్ణారెడ్డికి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం సమయంలో రామకృష్ణారెడ్డిని హతమారుస్తామని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ నేత రామకృష్ణారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget