News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

ఆడపిల్లలు పుట్టారని అరాచకం, పెళ్లాన్ని ఇంట్లో నుంచి గెంటేసిన శాడిస్టు భర్త 

ఆడపిల్లలు పుట్టారని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ముగ్గురు పిల్లలను భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాలింత అయిన భార్య అత్తారింటి ముందు ధర్నాకు దిగింది.

FOLLOW US: 

కాలం మారుతోంది. టెక్నాలజీ పరుగులు పెడుతోంది. స్త్రీలు, పురుషులు అన్న భేదం మరచి ఈ సాంకేతిక యుగంలో దూసుకెళ్తున్నారు రోదసీలోకి కూడా మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ రంగం.. ఆ రంగం అనే తేడా లేకుండా ప్రతి రంగంలోనూ తమదైన రీతిలో ‌విజయాలు అందుకుంటున్నారు. ఇంట్లో మాత్రం నెగ్గుకు రాలేకపోతున్నారు. ఏదో వంకతో మహిళలను ఫ్యామిలీ మెంబర్స్ వేధిస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. ముఖ్యంగా భర్త స్థానంలో ఉన్న వ్యక్తి సతాయింపులు భరించ లేక బయటకు వస్తున్న ఆడవాళ్లు ఎందరో. అలాంటివారిలో స్వప్న ఒకరు. 

మారని కొందరి నీచ బుద్ధి..

మహిళలు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నా.. కొడుకుల్లేని ఇంటికి వారే కొడుకులా మారి తల్లిదండ్రులను చూసుకుంటున్నా.. కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారడం లేదు. అలాంటి బ్యాచ్‌లో గోరెంకా శ్రీకాంత్ ఒకడు. హైదరాబాద్ శివారులోని సైదాబాద్ ఇంద్రప్రస్తాన్ కాలనీలో ఉంటున్నాడు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చదవులు అయితే ఉన్నతంగానే ఉన్నాయి కానీ, బుద్ధి మాత్రం అతఃపాతాళంలోనే ఉండిపోయింది. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అయినా.. తను అస్సలే సాఫ్ట్ కాదు.

2014లో స్వప్న అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్నందుకు 12 లక్షల రూపాయల కట్నం, 25 తులాల బంగారం తీసుకున్నాడు. వీరికి మొదటి కాన్పులో ఆడ పిల్ల పుట్టింది. ఆడ పిల్ల తనకు వద్దంటూ నిండు చూలాలు అయిన భార్యను, అప్పుడే పుట్టిన పసికందును ఇంట్లో నుంచి గెంటేశాడు. 

పెద్దల సమక్షంలో రాజీ..

పసికందును, బాలింతను ఇంట్లో బయటకు గెంటేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన గోరెంకా శ్రీకాంత్‌తో పెద్దలు మాట్లాడారు. వారి సమక్షంలోనే రాజీ కుదిరింది. అందరూ చెప్పడంతో ఇష్టం లేకపోయినప్పటికీ భార్యను పసికందును ఇంట్లోకి రానిచ్చాడు. భర్త మారాడని భార్య స్వప్న సంబర పడింది. కానీ శ్రీకాంత్‌లోని ఆ మృగం నిద్ర మాత్రమే పోయిందని.. అది ఏనాటికైనా లేస్తుందని గమనించలేకపోయింది ఆ మహిళ.

రెండో కాన్పులోనూ ఆడపిల్ల..

ఇటీవల స్వప్నకు రెండోసారి కాన్పు జరిగింది. ఈసారి కవలలు జన్మించారు. అందులో ఒకరు ఆడపిల్ల కాగా, మరొకరు మగ పిల్లాడు. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో గోరెంకా శ్రీకాంత్ మరింత వెర్రెక్కిపోయాడు. భార్య స్వప్నను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. బాలింత అని కూడా చూడకుండా స్వప్నను, ఇద్దరు పసికందులను, మరో చిన్నారిని కట్టుబట్టలతో గెంటేశాడు.

మారాడనుకున్న భర్త ఇలా చేసే సరికి స్వప్నకు ఏం చేయాలో అర్థం కాలేదు.  ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న స్వప్నకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. ఆమె తరఫున సైఫాబాద్ ఇంద్రప్రస్తాన్ కాలనీలోని గోరెంకా శ్రీకాంత్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఇదేమీ పట్టని సాఫ్ట్ వేర్ శ్రీకాంత్.. మహిళలు చేస్తున్న ధర్నాను మేడపై నుంచి వీడియో తీస్తూ ఎంజాయ్ చేశాడు. అది చూసిన మహిళా సంఘాలకు చిర్రెత్తుకొచ్చింది. మహిళా సంఘాలు ఆగ్రహంతో ఇంట్లోకి చొచ్చుకు వెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు మహిళ సంఘాల జోక్యంతో రాజీ కుదిర్చి స్వప్నను ఇంట్లోకి పంపించారు.

Published at : 03 Aug 2022 10:13 PM (IST) Tags: telangana latest news Hyderabad Latest Crime News Wife Protest Husband Harrasment Wife Protest Infront of Husbands House

సంబంధిత కథనాలు

Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు

Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు

Nellore Accident : పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, పిల్లల్ని వదిలేసి డ్రైవర్ పరారీ

Nellore Accident : పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, పిల్లల్ని వదిలేసి డ్రైవర్ పరారీ

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

భార్యకు కు.ని. ఆపరేషన్ అన్నాడు- పిల్లల్ని ఖూనీ చేశాడు

భార్యకు కు.ని. ఆపరేషన్ అన్నాడు-  పిల్లల్ని ఖూనీ చేశాడు

టాప్ స్టోరీస్

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?