అన్వేషించండి

Warangal Crime : వరంగల్ ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో చోరీ, పారిపోతూ బావిలో పడ్డ దొంగ!

Warangal Crime : వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం పారిపోతూ బావిలో పడ్డాడు దొంగ.

Warangal Crime :వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని  ఎస్ఆర్  ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో దొంగతనం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ రూమ్ లోకి వెళ్లిన దుండగులు విద్యార్థుల సెల్  ఫోన్స్, ల్యాప్ ట్యాప్ లు ఎత్తుకెళ్లారు. గర్ల్స్ హాస్టల్ లో సెక్యూరిటీ లోపానికి ఈ ఘటనలు నిదర్శనం అంటున్నారు విద్యార్థులు. వరుసగా నాలుగు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం దొంగతానికి పాల్పడిన దుండగుడు తప్పించుకునేందుకు ప్రయత్నించి వ్యవసాయ బావిలో పడ్డాడు. హాస్టల్ లో మూడు సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ చోరీ జరిగిందని విద్యార్థులు తెలిపారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా బావిలో పడ్డాడు దొంగ. బావిలోంచి దొంగను బయటకు తీసి అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిని దొంగలను అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఇద్దరు హైదరాబాద్ కు చెందివారుగా గుర్తించారు. 

నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు 

 ఏపీలోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాజమండ్రికి చెందిన ఒక మైనర్ తో సహా నలుగురు అంతర జిల్లా దొంగలు ఉన్నారు. పట్టుబడిన నిందితులనుండి 7 లక్షల 75 వేల రూపాయల విలువైన సొత్తు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి అమలాపురం డీయస్పీ వై మాధవ రెడ్డి తెలిపారు. నిందితులపై 14 కేసులున్నట్లు చెప్పారు. రాజమండ్రికి చెందిన గొర్రెల చినబాబు, టేకుమూడి దుర్గా ప్రసాద్, ఉప్పులూరి భాస్ర శివరాజు లతొ సహా ఒక బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. వీరిపై వివిధ జిల్లాల్లోని ఎనిమిది పోలీస్టేషన్ల పరిధిలో 14 కేసులు ఉన్నాయని డీయస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 56.7 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 3 కిలోల వెండి, 20 వేల రూపాయల నగదు, రెండు మోటార్ సైకిళ్లు లక్ష రూపాయల విలువ చేసే ఇతర సామగ్రీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 

గ్యాస్ కట్టర్ తో తాళాలు పగలకొట్టి 

గుంటూరు లక్ష్మీపురం మహావీర్ జ్యూవెలరీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.షేక్ ఆలీ, చిలకా రత్నరాజులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి ఒక కేజి 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల 35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహావీర్ జ్యూవెలరీ దుకాణం షట్టర్ ను తొలగించి దుండగులు చోరీకి పాల్పడ్డారు.ఈ ఇద్దరు నిందితులు  గతంలో ఏటీఏం చోరికి యత్నం, మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో  ముద్దాయిలుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. గ్యాస్ కటర్ తో తాళాలను కట్ చేసి నగదు, బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నవంబర్ లో జరిగిన ఈ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు తాపీగా తమ పని ముగించారు. షేక్ లీ పాత గుంటూరుకు చెందని వ్యక్తి.. అతడు టింకరింగ్ షాపులో పనిచేస్తాడు. ఇక మరో నిందితుడు చిలకా రత్నరాజు  లారీ డ్రైవర్. అయితే వీరిద్దరి ప్రవృత్తి నేరాలు కావటం విశేషం. మొదట్లో ఇద్దరు వేర్వేరుగా చిల్లర నేరాలు చేసేవారు. అయితే వాటి ద్వారా ఎక్కువ ఆదాయం లభించకపోవటంతో ఇద్దరు కలుసుకొని నేరాలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా నవంబర్ 20వ తేదీన రాత్రి లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న మహావీర్ జ్యూయలరీ షాప్ తాళాలను గ్యాస్ కటర్ తో కట్ చేసి దొంగతానికి పాల్పడ్డారు. చాలా ఈజీగా తమ పని ముగించారు. నిందితులు గ్యాస్ కట్టర్ తో తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లి కేజీకి పైగా బంగారం దోచుకుంటుంటే ఎవ్వరికి అనుమానం రాలేదంటే వారి టాలెంట్ ఏంటో అర్దం అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget