News
News
X

Fake Currency Printing : యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్ల ప్రింటింగ్, ముఠా గుట్టురట్టు చేసిన వరంగల్ పోలీసులు!

Fake Currency Printing : యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్ల ప్రింట్ చేసిందో ముఠా. రద్దీ ప్రాంతాల్లోని షాపుల్లో చెలామణి చేస్తున్న ఈ గ్యాంగ్ ను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

FOLLOW US: 
 
Fake Currency Printing : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరు లక్షలు), కలర్ ప్రింటర్, ఏడు మొబైల్స్, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో  సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), యం.డి సమీర్(30), పేరాల అవినాష్ (28), కత్తి రమేష్ (24), యం.డి అక్రం ఆలీ (27), గడ్డం ప్రవీణ్ (33), గుండ్ల రజనీ (33), కత్తి సునిత (23), సోహెల్ (22) నిందితులని పోలీసులు తెలిపారు.  

జైలులో దొంగ ముఠాతో పరిచయం 

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. పోలీసుల అరెస్ట్ చేసిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా దొంగ నోట్ల ముద్రించి తీరును తెలుసుకున్న నిందితులు జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దీంతో నిందితులు నేర చరిత్ర కలిగిన నిందితులతో కలిసి నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారు.  యూట్యూబ్ ద్వారా ఓరిజినల్ రెండు వేల రూపాయలు పోలిఉండే కాగితాల గురించి తెలుసుకున్న ఈ ముఠా వాటిని కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించింది.  

News Reels

రద్దీ ఉండే ప్రాంతాల్లో నోట్ల చెలామణి

నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలతో పాటు కిరాణం, బట్టలషాపు, మద్యం బెల్ట్ షాపుల వద్ద నకిలీ నోట్లను చెలామణి చేసేవారు. గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో  నకిలీ నోట్లను చెలామణి చేశారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవారు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు.  నిందితులను అరెస్ట్ చేసి వారిని విచారించగా మిగతా నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకోసుకున్నారు.  

 సిబ్బందికి అభినందనలు

ఈ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్సెస్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నరేష్ కుమార్, ఎస్.ఐలు నిస్సారాషా, సుబేదారి ఎస్.ఐ రవికిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబులు రాజేష్, బిక్షపతి, శ్రీను, శ్రవణ్ కుమార్, రాజు, గౌతంలను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Published at : 18 Nov 2022 05:02 PM (IST) Tags: YouTube Crime News fake currency warangal police Warangal News

సంబంధిత కథనాలు

Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం!

Tirupati Boys Missing : తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం!

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Alluri Sitarama Raju District: భూసర్వే టార్గెట్‌లు, ఉన్నతాధికారుల మాటలు పడలేక తహసీల్దార్ ఆత్మహత్య!

Alluri Sitarama Raju District: భూసర్వే టార్గెట్‌లు, ఉన్నతాధికారుల మాటలు పడలేక తహసీల్దార్ ఆత్మహత్య!

Warangal News : విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Warangal News :  విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!