అన్వేషించండి

Vizag News: విశాఖలో సంచలనం - ఎస్సై, జడ్జిపై హత్యాయత్నం ఆరోపణలు! పరారీలోనే న్యాయమూర్తి

విశాఖపట్నం క్రైమ్ ఎస్సై నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె సోదరి, భీమిలి మేజిస్ట్రేట్ విజయలక్ష్ష్మి డ్రైవర్ అప్పల రెడ్డిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు.

భూ విక్రయాల విషయంలో తమతో వివాదాలు ఏర్పడ్డ ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి పురిగొల్పారన్న ఆరోపణలతో విశాఖపట్నం క్రైమ్ ఎస్సై నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె సోదరి, భీమిలి మేజిస్ట్రేట్ విజయలక్ష్ష్మి డ్రైవర్ అప్పల రెడ్డిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు. అక్కాచెల్లెళ్లు అయిన విజయ లక్ష్మి, నాగమణిలో ఒకరు భీమిలి మేజిస్ట్రేట్ కాగా మరొకరు విశాఖలో క్రైమ్ ఎస్సై. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తో భూ విక్రయాల విషయంలో విజయలక్ష్మికి  వివాదాలు ఏర్పడ్డాయి. ఈ విషయం విజయలక్ష్మి తన సోదరి నాగమణికి చెప్పడంతో ఆయనపై ప్రతీకారానికి ప్రణాళిక చేశారు. 

క్రైమ్ కానిస్టేబుల్ ప్రమోద్ సహకారంతో కూర్మాన రామస్వామి, రాజు అనే వన్ టౌన్ కి చెందిన వ్యక్తులతో పాటు భీమిలికి చెందిన మరో వ్యక్తితో కలిసి సుపారీ మాట్లాడారనేది ఆరోపణ. జూన్ 19 న రాజేష్పై పైన పేర్కొన్న వ్యక్తులు దాడి చేయగా రాజేష్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కుట్రకోణం బయటపడింది. దానితో హత్యాయత్నం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏకంగా ఒక మేజిస్ట్రేట్, ఒక క్రైమ్ ఎస్సైల పైనే ఆరోపణలు రావడంతో పక్కాగా దర్యాప్తు చేశారు. 

ఈ హత్యాయత్నంతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేజిస్ట్రేట్ కారు డ్రైవర్ అప్పల రెడ్డి, SI నాగమణి మాత్రం ఇంతకాలం పరారీలోనే ఉన్నారు. అనేక మార్లు విచారణ జరిపిన పోలీసులు చివరకు నాగమణి, అప్పల రెడ్డిలను ఒడిశాలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మేజిస్ట్రేట్ విజయలక్ష్మి విషయం మాత్రం ఇంకా బయటకి రాలేదు. ఆమె ఇంకా పరారీలోనే ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు, రేపట్లోగా పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. అయితే ఏకంగా ఒక క్రైమ్ మహిళా  ఎస్సై పైనే ఇలాంటి ఆరోపణలు రావడంతో పాటు ఒక మహిళా జడ్జిపై కూడా హత్యాయత్నానికి ప్రోత్సహించిన ఆరోపణలు రావడం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది.

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget