Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో

Hyderabad Outer Ring Road | కీసర: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న అశోక్ లేలాండ్ ఆటో వెనుక వైపు టైర్ హఠాత్తుగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీ కొట్టింది. ఈ ప్రమాదలో ఇద్దరు కూలీలు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ORR పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో కూలీలు కీసర నుంచి షామీర్పేట్ వైపు ఆటోలో వెళ్తున్నారు.

పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న వారి జీవితాలు రోడ్డు ప్రమాదంతో తెల్లారిపోయాయి. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మృతులను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే అక్కడికి స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన కూలీలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)
ట్రెండింగ్ వార్తలు























