Hyderabad: నగరంలో దారుణం - వంట బాగాలేదని భార్యను ఇటుకతో కొట్టి చంపేశాడు
Telangana News: వంట బాగాలేదని ఓ వ్యక్తి తన భార్యను ఇటుకతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Husband Killed His Wife With Brick In Bachupally: భార్య వండిన వంట బాగాలేదని ఓ భర్త, ఆమెను ఇటుకతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన బాచుపల్లి (Bachupally) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు బాచుపల్లి పరిధిలోని ప్రగతి కన్ స్ట్రక్షన్ వద్ద కూలీలుగా పని చేస్తున్నారు. అయితే, మంగళవారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భార్య రవీనాదూబే (26) వండిన వంట బాగాలేదని ఆమెను భర్త ఇటుకతో కొట్టి చంపేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
మరోవైపు, వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య కలకలం రేపింది. యాలాల మండలం దౌలాపూర్ లో రాజప్ప అనే ఆర్టీసీ డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వేధింపులతోనే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుడు తాండూరు డిపోలో పని చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: KCR: నాకే రైతుబంధు రాలేదు, జీతాల తర్వాత ఇస్తారట - తుమ్మల కామెంట్స్ వైరల్, కేసీఆర్ కౌంటర్