అన్వేషించండి

Banjara hills: బంజారాహిల్స్ లో రూ.3.50 కోట్ల పట్టివేత, తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

రాష్ట్రంలో ఎన్నికైన నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతున్నాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు మొదలుపెట్టారు. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. అన్నిచోట్లా ముమ్మరంగా సోదాలు చేపడుతున్నారు. ఎటువంటి పత్రాలు, ఆధారాలు లేకుండా నగదు, బంగారం, వెండి, మద్యం, ఇతర వస్తువులను తరలిస్తుంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో కారులో తరలిస్తున్న 3.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటకు వస్తన్నాయి. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టల కోట్ల మోత మోగుతోంది. బంజారాహిల్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న రూ. 3.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

 ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం బంజారాహిల్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మ‌హేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. ఆ న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్‌ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

అలాగే హైదరాబాద్‌లోనే మరో చోట 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మర తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇదేక్రమంలో నల్గొండ జిల్లా అనుములలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు. 

 ఇటీవల కొన్ని

మిర్యాలగూడలో రూ.3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హబీబ్ నగర్‌లో 17 లక్షలు సీజ్‌ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మూడు రోజుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. ఇప్పటి వరకు 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ వేళ పాతబస్తీలో అర్థరాత్రి పోలీసులు కార్డన్‌ సర్చ్‌ నిర్వహించారు. పలుచోట్ల బెల్ట్ షాపులను గుర్తించారు. భారీగా మద్యం స్వాదీనం చేసుకున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఇప్పటివరకు 4 కోట్ల నగదు, 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, 7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 179 కేసులు నమోదు చేయడంతో పాటు 136 మందిని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల అంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లరాదని, ఒకవేళ తీసుకువెళ్తే సరైన పత్రాలు చూపించాలని ఎన్నికల అధికారులు చెప్పారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినా కానీ కోట్లలో నగదు పట్టుబడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget