అన్వేషించండి

Hyderabad Crime: బిల్డింగ్ పైనుంచి దూకిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి, విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రగాయాలు

Hyderabad News | మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగిన అనంతరం ఓ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.

Mallareddy Agriculture university | హైదరాబాద్: ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో జరిగింది. తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ బిల్డింగ్ మీది నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హరినాథ్ అనే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. ఆపై ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో విద్యార్థి హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థులు, యాజమాన్యం హరినాథ్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అతడు ఎందుకు పురుగుల మందు తాగి బిల్డింగ్ మీద నుంచి దూకాడు, ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget