అన్వేషించండి

Honey Trap Case : హనీట్రాప్ కేసు- అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి దోచేస్తున్న ఐదుగురి అరెస్ట్

Honey Trap Case : శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న హనీ ట్రాప్ కేసులో ఐదుగురు నిందితులను భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయితో వల విసిరి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు.

Srikakulam Honey Trap Case : శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి, నగదు దోచేసిన ఘటనలో ఐదుగురిని భీమిలి (Bhimili Police) పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో పేరుతో వలవేయడం, బెదిరింపులకు పాల్పడడం, దాడి చేయడం హనీ ట్రాప్ కేసుల్లో అసలు లక్ష్యం. కొన్ని రోజుల క్రితమే వైజాగ్ (Visakhapatnam)లో హనీ ట్రాప్ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న మరో కేసులో శ్రీకాకుళం (Srikakulam)కి చెందిన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అసలేమైందంటే...

ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ కేసులు (Honey Trap Case) మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఓ మహిళ బాధితులకు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకుంటారు. ఆ తర్వాత తమను ఓ చోటుకి రమ్మని, వారిపై దాడి చేసి, ఉన్నదంతా కాజేస్తారు. అదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ మధ్య ఓ కేసు బయటపడింది. కంచరపాలేనికి చెందిన ఓ వివాహిత, సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ చేయడం ఆరంభించారు. అలా పక్కా ప్లాన్ చేసి పాతపట్నానికి చెందిన రామారావు ను లక్ష్యంగా చేసుకున్నారు. అలా జనవరి 18న ఆ యువతి రామారావుకి ఫోన్ చేసి, ఆకట్టుకునే మాటలతో తనవైపుకు తిప్పుకుంది. తాను జనవరి 19న విశాఖకు వస్తానని, ఆ రోజు ఇద్దరం కలుసుకుందామని చెప్పడంతో.. అప్పటికే ఆమె మాయ మాటలు నమ్మిన మత్తులో ఉన్న రామారావు కూడా అందుకు ఓకే చెప్పేశాడు. 

చెప్పినట్టుగానే ఆ యువతి ఆ రోజున రామారావుకు ఫోన్ చేసింది. అప్పుడే తన కుమార్తెను బోయిపాలెం వద్ద హాస్టల్‌లో దింపేసి వెళ్లిపోతున్న రామారావు.. యువతి చెప్పిన తగరపువలస సమీపంలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లాడు. అంతలోనే అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు రూ.50వేలు, ఏటీఎం (ATM) కార్డులు లాక్కున్నారు. ఆ తర్వాతి రోజు వారు అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.7 వేలు కాజేశారు. దీంతో తన నగదు మాయంపై బాధితుడైన రామారావు భీమిలి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. తన జరిగిన విషయాన్ని మొత్తం తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలా ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతకీ ఆ యువతి ఎవరు, ఇప్పటివరకు ఎంత మందిని మోసం చేసింది అన్న పలు విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read : Republic Day Parade 2025 : ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే - 15వేల మంది పోలీసులు, 6 అంచెల భద్రత, వేల సీసీ కెమెరాలతో పూర్తి నిఘా

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget