By: ABP Desam | Updated at : 27 Jul 2021 04:05 PM (IST)
RAJ_KUNDRA_BOLLY_FAME
హాట్ షాట్స్ యాప్ ప్రారంభించి బిట్లతో కోట్లకు కోట్లు వెనకేసుకున్న రాజ్ కుంద్రా.. తన ప్లాన్ ఎక్కడైనా బెడిసి కొడుతుందేమో అన్న ఉద్దేశంతో వేరే యాప్‌ను కూడా సిద్ధం చేశారు. ఆ యాప్ పేరు బాలీ ఫేమ్. హాట్ షాట్స్ పేరుతో ఉన్న యాప్‌లో విపరీతంగా అశ్లీల కంటెంట్ ఉండటంతో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాప్ల్ యాప్ స్టోర్ నుంచి కూడా వాటిని తొలగించాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. పోలీసులు కూడా అదే సూచన చేయడంతో గూగుల్, యాపిల్ సంస్థలు ఆ యాప్ ను తొలగించాయి. కానీ.. వెంటనే.. అశ్లీల కంటెంట్‌ను బాలీ ఫేమ్ యాప్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ యాప్ నిషేధానికి గురి కాకుండా ఇంటలిజెన్స్ బ్యూరోకు చెందిన ఓ అధికారి భార్యను ముందు పెట్టారు. ఆమె పేరుతోనే యాప్‌ను రిజిస్టర్ చేశారు. ఏదైనా సమస్య వస్తే.. ఇంటలిజెన్స్ బ్యూరో అధికారి తన పవర్‌ను ఉపయోగిస్తారని.. దాంతో.. ఆ యాప్‌కు ఎలాంటి ముప్పు రాదని నమ్మకం పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే వ్యవహారం నడించింది.
అయితే బాలీఫేమ్ యాప్ అశ్లీల కంటెంట్‌కు సంబంధించినది కాదని.. ఆ ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ భార్యను రాజ్ కుంద్రా నమ్మించారు. అందు కోసం.. షమితా షెట్టిని పెట్టుకుని ... పలు రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లుగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని ... రాజ్ కుంద్రా కంపెనీలో అశ్లీల చిత్రాల్లో నటించిన నటి గెహనా మీడియాతో చెప్పారు కూడా. షమితా షెట్టితో రాజ్ కుంద్రా.. షార్ట్ ఫిల్మ్‌లు ఇంటర్యూలు ప్లాన్ చేశారని.. కానీ అవి అశ్లీలం కాదన్నారు. రాజ్ కుంద్రా తీస్తున్నవి.. అశ్లీలం కాదని గెహనా ముందు నుంచీ వాదిస్తున్నారు. అయితే పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారీ చేశారు. విచారణ చేయబోతున్నారు.
ఇప్పుడు ఈ బాలీఫేమ్ యాప్ గురించి బయటకు తెలియడంతో అందులో ఉన్న అశ్లీల కంటెంట్ మొత్తాన్ని తొలగించాలని ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ భార్య.. రాజ్ కుంద్రాను హెచ్చరించింది. రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత మొత్తం.. ఆ కంటెంట్ ను బాలీ ఫేమ్ యాప్ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. రాజ్ కుంద్రా చాలా తెలివిగా బిట్ల వ్యాపారం చేశారు. ఈ విషయం ఆయన యాప్‌లకు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకున్నప్పుడే తెలుస్తుందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కుంద్రా నిండా మునిగిపోయారని... బయటపడటం సాధ్యం కాదని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే బాలీవుడ్ వర్గాలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియర్ ఆఫీస్లపై పోలీసుల నిఘా
Goa News: గోవా బీచ్‌లో దారుణం- బ్రేకప్ చెప్పిందని యువతిని కత్తితో పొడిచి, బాడీని పొదల్లో పారేశాడు!
Disha Fake Encounter : దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం, సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు
MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా