అన్వేషించండి

Andhra Pradesh: జైలు నుంచి ఖైదీ పరారీ, వార్డెన్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు!

Andhra Pradesh | రాజంపేట సబ్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. రైల్వే కోడూరుకు చెందిన భాషా అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పింకుకోవడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

Rajampet Jail | రాజంపేట: సినిమాల్లో కామెడీ కోసం కొందరు ఖైదీలు పారిపోయే సీన్లు చూస్తుంటాం. మరికొన్ని సినిమాల్లో పోలీసులకు చెప్పి మరీ ఖైదీలు తప్పించుకోవడం చూసి ఉంటారు. కానీ అప్పుడప్పుడు రియల్ గానూ కొందరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి పరారవుతుంటారు. సరిగ్గా అలాంది ఘటనే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో జరిగింది. ఓ ఖైదీ రాజంపేట జైలు నుంచి పరార్ కావడంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు.

రైల్వే కోడూరుకు చెందిన భాషా జైలు నుంచి పరారైన ఖైదీగా గుర్తించారు. విషయంపై సీరియస్ అయిన నెల్లూరు రేంజ్ జెళ్ళ శాఖా డి.ఐ.జి రాజేశ్వర రావు రాజంపేట సబ్ జైలులో విచారణ చేపట్టారు. సబ్ జైలు అధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు. బాషా గత ఏడాది నవంబరు నుంచి ఓ హత్య కేసులో రిమాండులో ఉన్నాడు. గురువారం నాడు ఖైదీలను జైలు గది నుంచి బయటకు వంట చేయడానికి వదిలారు. ఆ సమయంలో దుప్పటిని తాడుగా మలుచుకుని బాషా అనే ఖైదీ గోడ దూకి పరారయ్యాడు. కాసేపటికి ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నట్లు గుర్తించారు పోలీసులు. విషయం తెలుసుకున్న జైలర్ మల్లా రెడ్డి ఖైదీ బాషా పరారీపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

జైలు నుంచి బాషా అనేది ఖైదీ తప్పించుకోవడంపై అధికారులు శాఖ పరమైన విచారణ చేపట్టారు. నిర్లక్ష్యం కారణంగానే ఖైదీ పరారయ్యాడా అనే కోణంలోనూ విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు విధుల్లో ఉన్న వార్డెన్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. జైలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖైదీ పరారీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అర్బన్ సీఐ మద్దయ్యచారి తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Fake Currency Printing Racket: డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు
కొత్త కారు కొనేవాళ్లకు బంపర్ ఆఫర్‌ - Honda కార్లపై రూ.2 లక్షలకు పైగా బెనిఫిట్స్‌
Embed widget