అన్వేషించండి

Pastor Abhinay Darshan: చింతపల్లి పాస్టర్ అభినయ్ దర్శన్‌ హత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్! సానుభూతి కోసం దాడి డ్రామా!

Pastor Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌పై జరిగిన దాడి సంచలనంగా మారింది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి జరిగినట్లు ప్రచారం జరిగింది.
  • పోలీసులు కేసు విచారించగా, దాడి డ్రామాగా తేలింది.
  • సానుభూతి కోసం ఆరుగురితో కలిసి పథకం రచించారు.
  • ఫేక్ అటాక్‌పై పాస్టర్‌తో పాటు ఆరుగురిపై చర్యలు.

Pastor Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District)చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఒక వార్త సంచలనంగా మారింది. పాస్టర్ అభినయ్ దర్శన్‌(Pastor Abhinay Darshan)పై గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి చేశారని ఆయనను చంపేందుకు యత్నించారనే ప్రసారం జోరుగా సాగింది. ఒక మతబోధకుడిపై ఇలాంటి దాడి జరగడం వెనుక ఉన్న కారణాలు ఏంటనే ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. 

పాస్టర్ అభినయ్‌ దర్శన్‌పై దాడి అంటూ ప్రచారం

పాస్టర్ అభినయ్‌ దర్శన్ కథనం ప్రకారం ఆయన చింతపల్లి(Chintapalli Police) పరిసరాల్లో కారులో ప్రయాణిస్తుండగా కొంతమంది వ్యక్తులు విరుచుకుపడ్డారు. కారు అద్దాలు పగులగొట్ట తనను చంపేందుకు తీవ్రంగా యత్నించారు. అయితే తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని ఆయన హంగామా చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన కేసు కావడంతో, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ స్వయంగా రంగగంలోకి దిగి పర్యవేక్షించారు. 

సోషల్ మీడియా విప్పిన గుట్టు

కేసును లోతుగా విశ్లేషించిన పోలీసులకు ప్రారంభం నుంచే కొన్ని అనుమానాలు కలిగాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అభినయ్ దర్శన చెబుతున్న మాటలకు పొంతన కుదరలేదు. ఎస్పీ అమిత్‌ బర్దర్‌(SP Amit Bardar) పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాయి. ఈ క్రమంలోనే అభినయ్‌ దర్శన్ ఉపయోగించిన సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పోలీసులు కుణ్ణంగా పరిశీలించారు. 

పక్కా ప్లాన్ ప్రకారం చేపట్టిన దాడి డ్రామాగా తేల్చిన పోలీసులు 

అక్కడ దొరికిన ఆధారాలు పోలీసులను విస్మయానికి గురి చేశాయి. ఈ హత్యాయత్నం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు నాటకమని (Fake Assassination Attempt)చాట్ హిస్టరీ, ఆడియో సందేశాలు స్పష్టం చేశాయి. దాడి జరిగినట్టు నమ్మించేందుకు ముందుగానే ఎవరికీ ఏ బాధ్యతలు అప్పగించారో నిర్ణయించుకున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.

ఆరుగురు పాల్గొన్నట్టు తేల్చిన పోలీసులు

పోలీసుల విచారణలో తేలిన కీల విషయం ఏంటంటే, ఈ దాడి అసలు జరగనే లేదు. కేవలం సానుభూతి పొందడం కోసం లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం అభినయ్ దర్శన్ ఈ పథకాన్ని రచించారు. ఈ నాటకంలో ఆయన ఒంటరివాడు కాదు, అభినయ్‌కు సహకరించిన మరో ఆరుగురు వ్యక్తులు కూడా ఈ కుట్రలో భాగమయ్యారని పోలీసులు గుర్తించారు. 

పేక్ అటాక్ అని తేల్‌చిన పోలీసులు

అభినయ్‌ దర్శన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా(Instagram Evidence)లోని వీడియో చాట్స్‌ , ఆడియోలు ఈ ప్లాన్‌ను ముందే సిద్ధం చేసినట్టు నిరూపించాయి. గాయాలైనట్టు అభినయ్ చేసిన ప్రకటనను వైద్యులు నివేదికలు తప్పుబట్టాయి. ఆ నివేదికలను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ ఎటాక్ అని నిర్దారించారు. 

మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసేలా, పోలీసు యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించేలా ప్రవర్తించిన అభినయ్ దర్శన్‌తోపాటు ఆయనకు సహకరించిన ఆరుగురిపై పోలీసుల కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.  

Frequently Asked Questions

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి నిజమేనా?

లేదు, పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి అనేది సానుభూతి పొందడానికి లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అతను చేసిన నాటకం. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఈ సంఘటనలో ఎంత మంది పాల్గొన్నారు?

ఈ దాడి నాటకంలో పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు ఈ నాటకాన్ని ఎలా కనిపెట్టారు?

సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, పాస్టర్ అభినయ్ దర్శన్ వాడిన సోషల్ మీడియా (ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్) చాట్ హిస్టరీ, ఆడియో సందేశాలను పరిశీలించడం ద్వారా పోలీసులు ఈ కుట్రను కనిపెట్టారు.

పాస్టర్ అభినయ్ దర్శన్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేలా, పోలీసులను తప్పుదారి పట్టించేలా ప్రవర్తించినందుకు పాస్టర్ అభినయ్ దర్శన్ మరియు సహకరించిన ఆరుగురిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget