Palnadu News : పల్నాడు జిల్లాలో దారుణం, ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి వివాహిత ఆత్మహత్య!
Palnadu News : పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో వివాహిత పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది.
Palnadu News : పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నుజేండ్ల మండలం తెల్లబాడుకు గ్రామానికి చెందిన సౌజన్య లక్ష్మి(26), ఇద్దరు పిల్లలతో గడ్డి మందు తాగించి, తాను ఆత్మహత్యకు యత్నించింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పిల్లలు శివ పార్వతి(3), 9 నెలల మనితేజకు ముందుగా గడ్డి మందు తాగించింది. ఆ తర్వాత తాను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వీరిని గమనించిన స్థానికులు నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి సౌజన్య లక్ష్మి,బాబు, చిన్నారి మనితేజ మృతి చెందారు. పాప శివ పార్వతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు గడిస్తే గాని పాప సంగతి చెప్పలేమని వైద్యులు తెలియజేశారు.
కోడలితో విషం తాగించిన అత్త
పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమాజం సిగ్గుపడేలా దారుణ ఘటన చోటుచేసుకుంది. మరోసారి ఆడ బిడ్డకు జన్మనిస్తుందని తెలిసి అత్తంటి వారు కోడలిపై విషప్రయోగం చేశారు. దీంతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంది. కొప్పురాపాలెం గ్రామానికి చెందిన శ్రావణికి రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెంకు చెందిన వేణుతో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక పాప మరలా గర్భవతి అయిన శ్రావణికి ప్రస్తుతం ఆరో నెల.. ఈ నేపథ్యంలో స్కానింగ్(చట్టరీత్యానేరం) చేయించగా మరలా ఆడపిల్లగా నిర్థారణ అయింది. రెండో సారి కూడా ఆడపిల్లా అని తెలియడంతో అత్తంటి కుటుంబ సభ్యులు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి కోడలితో తాగించారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విపరీతంగా వాంతులు అయి అపస్మారక స్థితికి చేరుకోవడంతో శ్రావణిని నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చావుతో పోరాటం చేస్తుంది శ్రావణి. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రశ్నించిన వారిపై సహితం అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
లవర్ కు వీడియో కాల్ చేసి లైవ్ లో యువకుడు సూసైడ్
హైదరాబాద్ పాతబస్తీలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నానన్న బాధతో ఓ యువకుడు లవర్ కు వీడియో కాల్ చేసి లైవ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఓల్డ్ సిటీలోని కలాపట్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహ్మద్ తబ్రేజ్ అలీ స్థానికంగా ఉండే ఓ అమ్మాయితో ప్రేమయాణం సాగించాడు. ఈ ప్రేమ వివాహానికి ఇద్దరి ఇళ్లలో ముందు ఒప్పుకున్నారు. అనంతరం కొన్ని రోజులకు రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంతో ప్రేమ పెళ్లికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య రిలేషన్ నడుస్తూనే ఉంది. ఇరు కుటుంబ కలహాలతో తమ పెళ్లికి బ్రేక్ పడిందన్న బాధతో యువకుడు లవర్ కు కాల్ మాట్లాడుకుంటూనే లైవ్ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి సూసైడ్ పై పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు.