అన్వేషించండి

పోషించే స్థోమత లేక భార్యతో పాటు ఏడుగురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

Pakistan Crime: పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని పోషించలేక గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు.

Pakistan Man Kills Wife: పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి తన భార్యని, 7 గురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపాడు. వాళ్లని పోషించే స్థోమత లేక ఇలా దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు ఉపాధి కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది పూట గడవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే సజ్జద్ ఖోకర్ అనే ఓ కూలీ తన భార్యతో పాటు పిల్లల్ని ఇలా చంపుకున్నాడు. పిల్లల్లో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వీళ్లలో 8 నెలల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే...నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని, అప్పులు తీర్చలేక చాలా రోజులుగా ఒత్తిడిలో ఉన్నాడని వివరించారు పోలీసులు. ఇదే విషయమై భార్యతో తరచూ గొడవ పడేవాడని స్థానికులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడు ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు. వాళ్లని పోషించే స్థోమత లేదని, అందుకే చంపాననని చెప్పాడు. హత్య చేసిన తరవాత తనంతట తానుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.  దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్థిక స్థిరత్వం లేకుండా ఏ దేశమూ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని అందులో పేర్కొన్నారు. 1971 నాటి రోజులు గుర్తొస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Embed widget