అన్వేషించండి

Nursing Student: భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి - కళాశాల వద్ద బంధువుల ఆందోళన

Bhadrachalam News: భద్రాచలంలో ఓ నర్సింగ్ విద్యార్థిని తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. దీంతో బంధువులు, విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు.

Nursing Student Death In Bhadrachalam: భద్రాచలంలో (Bhadrachalam) ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రాచలంలోని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పారా మెడికల్ కాలేజీలో విద్యార్థిని కారుణ్య ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. గురువారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను యాజమాన్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు, విద్యార్థులు శుక్రవారం ఉదయం కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పేందుకు యత్నించారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై బంధువులు, విద్యార్థులు దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

న్యాయం చేయాలని డిమాండ్

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య కళాశాల భవనం వద్ద కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా.. వారు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే, యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెబుతోందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని.. పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే కారుణ్య మృతికి కారణాలు వెల్లడవుతాయని తెలిపారు.

Also Read: Telangana Crime News: కొడుకును చూడవా అంటూ ముద్దుగా పిలిచింది- వెళ్తే ఫ్యామిలీ కుమ్మేసింది- హైదరాబాద్‌లో దారుణం!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
Nizamabad Youtuber Vaishnavi husband Haribabu murder: నిజామాబాద్‌లో రివేంజ్ మర్డర్ - యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు దారుణ హత్య!
నిజామాబాద్‌లో రివేంజ్ మర్డర్ - యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు దారుణ హత్య!
Keesara Police Station ACB Trap: కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!
కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget