అన్వేషించండి

North Carolina Mass Shooting: యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో మైనర్ కాల్పులు, ఐదుగురు మృతి

North Carolina Mass Shooting: అమెరికాలోని నార్త్ కరోలినాలో మైనర్ కాల్పులు జరపగా ఐదుగురు మృతి చెందారు.

North Carolina Mass Shooting:

రాలీలో కాల్పులు..

అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియా రాజధాని రాలీలో ఓ మైనర్ కాల్పులు జరపగా...ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ఆఫ్‌ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని నీస్‌ వద్ద గ్రీన్‌వే సమీపంలో సాయంత్రం ఈ దాడి జరిగినట్లు మేయర్‌ మారీ అన్నా బాల్డ్‌విన్‌ వెల్లడించారు. "ఇదెంతో విషాదకరమైన రోజు. సాయంత్రం 5 గంటల తరవాత ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు" అని చెప్పారు. రాలీ పోలీస్ విభాగం కూడా మృతుల సంఖ్యను 5గా నిర్ధరించింది. రాత్రి 9.30 గంటల తరవాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. నిందితుడు బాలుడని, అక్కడే సమీపంలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఒకరి తీవ్రంగా గాయపడ్డారని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ కాల్పులకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. అమెరికాలో గన్‌ వయలెన్స్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకూ కాల్పుల కారణంగా...34,000 మంది చనిపోయారు. వీరిలో సగానికి పైగా తమకు తాము కాల్చుకుని చనిపోయిన వాళ్లే ఉన్నారు. ఆత్మరక్షణ కోసం తుపాకీ తీసుకుని...చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా మంది. ఈ హింసను అడ్డుకునేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న కట్టడి చర్యలు చాలవని, వీటిని ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

వరుస ఘటనలు..

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలకు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో వాషింగ్టన్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. వైట్ హౌస్‌కు సమీపంలోనే ఈ కాల్పులు జరిగాయి. వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌ నార్త్‌వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార‍్యక్రమంలో ఈ కాల్పులు జరిగాయి. ఇది వైట్‌ హౌస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలో ఉంది. ఈ కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. అయితే కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. మే చివరి వారంలో టెక్సాస్ కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల​ తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. 

Also Read: Indian Student Attacked In Sydney: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి, 11 సార్లు కత్తితో పొడిచిన దుండగుడు

టాప్ హెడ్ లైన్స్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget