అన్వేషించండి

Nellore Crime : కాలేజీ బ్యాగుల్లో గంజాయి, స్టూడెంట్సే వ్యాపారులు!

కావలిలో ఇటీవల గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. ముఖ్యంగా స్టూడెంట్స్ గంజాయి తీసుకుంటున్నారని తెలిసింది. అయితే ఇక్కడ స్టూడెంట్సే వ్యాపారులుగా అవతారమెత్తారు.

ఒకరు డిగ్రీ, ఇంకొకరు, ఇంజినీరింగ్.. ఇద్దరూ చెడు వ్యసనాలకు బానిసయ్యారు. చదువు డిస్ కంటిన్యూ చేసినా ఇంట్లో మాత్రం కాలేజీలకు వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. బయటకొచ్చి సోదాగా తిరుగుతారు. అయితే ఇటీవల వీరు గంజాయి బిజినెస్ కూడా మొదలు పెట్టారు. వీరి వ్యవహారాలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో వ్యక్తికోసం గాలిస్తున్నారు. 

గంజాయికి బానిసై చివరకు వ్యాపారం

నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు తమకు సమాచారం రావడంతో తాము వాహనాలు తనిఖీ చేపట్టామని, కావలి పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరి బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు లభించాయని తెలిపారు సీఐ సుధాకర్ రెడ్డి. వీరిని గంజాయి తీసుకు రావాలని చెప్పిన వ్యక్తికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కావలిలో ఇటీవల గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. ముఖ్యంగా స్టూడెంట్స్ గంజాయి తీసుకుంటున్నారని తెలిసింది. అయితే ఇక్కడ స్టూడెంట్సే వ్యాపారులుగా అవతారమెత్తారు. గంజాయికి బానిసలైన వారు తాము తీసుకోవడంతోపాటు, వ్యాపారం చేస్తే మరింత లాభాలు వస్తాయని ఆశపడ్డారు. విశాఖ పట్నం వెళ్లి పాడేరు వద్ద గంజాయిని కొనేవారు. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో బ్యాగుల్లో పెట్టుకుని వచ్చేవారు. కావలిలోనే ఆప్యాకెట్లను విభజించి చిన్న చిన్న పొట్లాలు కట్టి అమ్మేస్తున్నారు. ఇలా అమ్మే క్రమంలో పోలీసులకు చిక్కారు. 

తల్లిదండ్రులకు సూచన

తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని సూచిస్తున్నారు పోలీసులు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిసలైతే తర్వాత జీవితం అంధకారమవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు రిమాండ్ కి తరలించారు. గతంలో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు గంజాయి పట్టుబడినా అది ఇక్కడినుంచి రవాణా అవుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. నెల్లూరు జిల్లాలో వివిధ చెక్ పోస్ట్ ల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకునేవారు. విజయవాడనుంచి, లేదా వైజాగ్ నుంచి నెల్లూరు మీదుగా చిత్తూరు, తిరుపతి, చెన్నైకి తరలించే క్రమంలో ఇక్కడ గంజాయి దొరికేది. కానీ ఇప్పుడు ఏకంగా గంజాయి వినియోగం ఇక్కడ జరుగుతుందని తేలింది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

ఇంట్లో గంజాయి

ఇటీవల నెల్లూరులో ఏకంగా గంజాయి మొక్కల్నే పెంచారు. ఇంటిలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆ ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో విరివిగా గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయినా ఇటీవల అవి తగ్గుముఖం పట్టాయి. ఇంతలో కావలి రాకెట్ బయటపడింది. కావలిలో గంజాయి రవాణాతోపాటు, వినియోగం కూడా ఉందని తేలడంతో కలకలం రేగింది. పోలీసులు ఈ సమాచారంతో అప్రమత్తమయ్యారు. నిఘా పెంచారు. పక్కా ఇన్ఫర్మేషన్ తో వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా పోలీసులు ఆ ఇద్దరు అనుమానితుల్ని అడ్డుకున్నారు. అయితే తమ వద్ద గంజాయి ఉందని పోలీసులకు తెలుసన్న విషయం నిందితులకు తెలియదు. సాధారణ చెకింగ్ లే అనుకుంటూ వారు పోలీసుల ముందు వాహనం ఆపారు. చివరకు గంజాయితో సహా వారికి చిక్కారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fire Accident: బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Chennai influencer killed: సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!
సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!
Husband Sitaram: భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!
భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Renault Triber VS Nissan Gravite: ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్లో రెనో సంచలనం - కొత్త ఫీచర్లతో 2026 ట్రైబర్ ఎంట్రీ.. నిస్సాన్ గ్రావైట్ తో పోరు షురూ.. 
ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్లో రెనో సంచలనం - కొత్త ఫీచర్లతో 2026 ట్రైబర్ ఎంట్రీ.. నిస్సాన్ గ్రావైట్ తో పోరు షురూ.. 
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Embed widget