అన్వేషించండి

దగ్గు మందు ఇచ్చి దిండుతో ఊపిరాడకుండా చేసి - గోవా చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు

CEO's Son Murder: గోవాలో కంపెనీ సీఈవో కొడుకుకి దగ్గు మందు ఇచ్చి ఆ తరవాత హత్య చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

 CEO's Son Murder News: 

నాలుగేళ్ల చిన్నారి హత్య..

గోవాలో ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో సొంత కొడుకునే హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలోనే ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ప్రీప్లాన్డ్ మర్డర్‌గా ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు. రూమ్‌లో కాఫ్ సిరప్ బాటిల్స్‌ కనిపించినట్టు తెలుస్తోంది. కావాలనే ఆ చిన్నారికి ఎక్కువ డోస్ ఉన్న కాఫ్ సిరప్ తాగించి ఆ తరవాత చంపేసినట్టు అంచనా వేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లోనూ మరి కొన్ని విషయాలు బయటపడ్డాయి. దిండుతో గట్టిగా అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్టు వైద్యులు వెల్లడించారు. నిందితురాలు సుచనా సేథ్ (Suchana Seth) కొడుకుని హత్య చేసిన తరవాత ఓ బ్యాగ్‌లో ఆ డెడ్‌బాడీని కుక్కింది. అక్కడి నుంచి నేరుగా ట్యాక్సీ బుక్ చేసుకుని కర్ణాటకకు వెళ్లినట్టు పోలీసులు వివరించారు. కర్ణాటకలోనే చిత్రదుర్గ వద్ద ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విచారణకు గోవాకి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ సమయంలోనే ఓ గదిలో చిన్న పిల్లల దగ్గు మందు బాటిల్స్ కనిపించాయి. నొప్పి తెలియకుండా కాఫ్ సిరప్‌ పోసి ఆ తరవాత దిండుతో చంపేసింది. అయితే...ఎంత డోస్‌ ఇచ్చిందనేది ఇంకా తెలియలేదని, దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. అపార్ట్‌మెంట్‌ స్టాఫ్‌నీ విచారించారు పోలీసులు. తనకు దగ్గు వస్తోందని, కాఫ్ సిరప్ తెచ్చి పెట్టాలని ఆ స్టాఫ్‌కి డబ్బులిచ్చింది నిందితురాలు. అయితే...విచారణలో మాత్రం నిందితురాలు తన నేరాన్ని అంగీకరించలేదు. తాను నిద్రలేచి చూసే సరికే బిడ్డ చనిపోయి ఉందని, తాను హత్య చేయలేదని వాదించింది.

విడాకుల కేసు..

భర్తతో గొడవ పడి విడిపోయిందని, ఆ కోపంలోనే చిన్నారిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. ఈ ప్రాసెస్‌లోనే కోర్టు ఇచ్చిన తీర్పు సుచనా సేథ్‌కి నచ్చలేదు. ఆ అసహనంలోనే కన్న బిడ్డనే చంపుకుంది. జనవరి 6వ తేదీన సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన సుచనా సేథ్..జనవరి 8వ తేదీ వరకూ అక్కడే ఉంది. ఆ తరవాత అక్కడి నుంచి ట్యాక్సీలో బెంగళూరు వెళ్లిపోయింది. జకార్తాలో ఉన్న ఆమె భర్త ఈ వార్త తెలియగానే బెంగళూరుకి వచ్చాడు. 

"ఆ చిన్నారికి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. బహుశా దిండుతో అదిమి పెట్టి చంపి ఉండొచ్చు. చేతులతో అయితే గొంతు నులిమి చంపినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఇదే తేలింది"

- పోలీసులు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Embed widget