అన్వేషించండి

Uttarakhand: నడిరోడ్డుపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వీరంగం - రాళ్లు విసురుకొని కాల్పులు జరుపుకొన్నారు, షాకింగ్ వీడియో

Viral Video: ఉత్తరాఖండ్‌లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరి కార్యాలయాలపై ఒకరు కాల్పులు జరుపుకొని రాళ్లు రువ్వుకున్నారు.

MLA Vs Ex MLA Fighting In Uttarakhand: నడిరోడ్డుపై ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకొంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూర్కీలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్, స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రణవ్ సింగ్ ఆదివారం తుపాకులు చేతపట్టి తన అనుచరులతో కలిసి ఖాన్‌పూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు అనుచరులు సైతం హల్చల్ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంపై కాల్పులు జరపడం సహా రాళ్లు రువ్వి దుర్భాషలాడారు.

అయితే, దీనికి ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ (Umeshkumar) సైతం దీటుగా స్పందించారు. తన అనుచరులతో కలిసి ప్రణవ్ సింగ్ కార్యాలయానికి వెళ్లి తుపాకీతో కాల్పులు జరపడం సహా దుర్భాషలాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరు నేతలపైనా కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ శనివారం రాత్రి లంధౌరాలోని తన భవనంపై దాడి చేశాడని, తనను దుర్భాషలాడినట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది చాలా అన్యాయమని.. దీనికి వ్యతిరేకంగా పోరాడతానని అన్నారు.

కాగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ మధ్య చాలాకాలంగా విరోధం నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒకరికొకరు ఆరోపించుకోవడం సహా విమర్శలు చేసుకోవడంతో వివాదానికి దారి తీసింది. దీంతో వీరిద్దరి వద్ద ఉన్న తుపాకుల లైసెన్స్ రద్దు కోసం జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫార్సు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

Also Read: Union Budget 2025: 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయా? నిధులు పెంచాల్సిన అవసరం ఏముంది?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget