అన్వేషించండి

Mancherial Police: మద్యం మత్తులో అర్ధరాత్రి పోలీసుల వీరంగం, సిబ్బందితో పాటు ఎస్సై హంగామా!

Mancherial Police: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ఎస్సై వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో సిబ్బిందితో కలిసి రోడ్లపై హల్ చల్ చేశారు. పోలీసు అయి ఉండి కేసు విచారించేందుకు వచ్చి పోలీసులపై దాడి చేశాడు.

Mancherial Police: మనకు ఏదైనా సమస్య రాగానే వెంటనే పోలీసుల వద్దకు పరిగెడుతుంటాం. ఎవరైనా తాగి వచ్చి అల్లరి చేసినా, హత్య, అఘాయిత్యం లాంటివి చేసేందుకు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. హుటాహుటిన రంగంలోకి దిగి వాళ్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. చాలా వరకు ఆపదలో ఉన్నామని చెప్పిన వెంటనే వచ్చి కాపాడుతుంటారు. కానీ అంతటి గౌరవపర వృత్తిలో ఉండి కూడా ఓ ఎస్సై.. ఫూటుగా మద్యం తాగి వీధి రౌడీలా ప్రవర్తించాడు. మద్యం మత్తులో రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా చేశాడు. మంచిర్యాల జిల్లాల్లో ఈ ఘటన జరిగింది.

రౌడీల్లా మారిన పోలీసులు.. కానిస్టేబుళ్లపై దాడి!

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ఏస్సై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కరీంనగర్ పోలీసు కమిసనరేట్ పరిధిలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఎస్సై తిరుపతి తన అనుచరులు, స్నేహితులతో కలిసి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ నానా హంగామా చేశారు. పట్టణంలోని ఐబీ ప్రాంతంలోని రోడ్లపై మంగళవారం అర్థరాత్రి పోలీసులు హల్ చల్ చేశారు. అప్పటికే పూటుగా తాగి ఉన్న పోలీసులు.. నానా రబస చేశారు. మద్యం సేవిస్తున్న వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి స్నేహితులు ఉన్నారు. ఇబ్బందులకు గురైన వాహనదారులు 100 డయల్ కు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి బ్లూకోర్టు పోలీసులు చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

పోలీసులు విచారణ చేపట్టే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డులపై సైతం ఎస్సై తిరుపతి అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన ఘటనను వీడియో తీస్తుంటే పరుష దూషిస్తూ, పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్ లను లాగేసుకుని ధ్వంసం చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంగం సృష్టించిన బెజ్జంకి ఎస్సై కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
Adilabad Crime News: మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
మంత్రాలకు డబ్బులు రెట్టింపు అంటూ మోసాలు.. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Embed widget