అన్వేషించండి

Attack on women: దొంగతనం నెపంతో మహిళలపై వ్యక్తి దాడి - ఏపీలో అమానుష ఘటన

Attack on women: దొంగతనం చేశారనే నెపంతో ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవిలో జరిగింది.

Attack on women: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ఓ వ్యక్తి ముగ్గురు ఎస్టీ మహిళలపై పైశాచిక దాడిగి దిగాడు. తమ ఇంట్లో దొంగతనం చేశారని ఆరోపిస్తూ వారిపై దాడికి పాల్పడ్డాడు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అనంతరం పోలీసులతోనూ కొట్టించాడు. 2 రోజులుగా బందీలుగా చేసి ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్, బాధితులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం అందించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా, దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీకి చెందిన నాయకుడని తెలుస్తోంది.

బాధితుల కన్నీరు

చేయని నేరాన్ని ఒప్పుకోవాలని మాపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 'కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజా అనే వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ ఉందని, కొద్ది రోజులు ఇంటి పని చేయాలని పనికి పిలిచారు. ఆ తర్వాత ఇంట్లో చోరీ జరిగిందని, అది మేమే చేశామంటూ విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో నా తలకు, ఒళ్లంతా గాయాలయ్యాయి. నేను తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా, బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవాలంటూ మరోసారి పోలీసులతో కొట్టించారు. ప్రశ్నించిన మా అమ్మను సైతం కొట్టారు.' అంటూ బాధిత యువతి కన్నీటి పర్యంతమయ్యారు.

డీఎస్పీకి ఫిర్యాదు

కాగా, ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్ తెలిపారు. 'బాధితులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఆయన కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.' అని చెప్పారు.

 

టాప్ హెడ్ లైన్స్

LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Fake Currency Printing Racket: డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Vizianagaram Crime News: పురుగుల మందు తెచ్చి ఇచ్చి లవర్ బ్లాక్ మెయిల్.. నిశ్చితార్థానికి ముందే యువతి ఆత్మహత్య
పురుగుల మందు తెచ్చి ఇచ్చి లవర్ బ్లాక్ మెయిల్.. నిశ్చితార్థానికి ముందే యువతి ఆత్మహత్య

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget