News
News
X

Konaseema Crime : బాలికపై సామూహిక అత్యాచారం, సర్పంచ్ కొడుకుతో సహా ఐదుగురు అరెస్టు!

Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాలికపై సామూహిత అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

FOLLOW US: 
Share:

Konaseema Crime :  బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంచనలం అయిన బాలికపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 6న బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకిరామ్ ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు.  నిందితులు ఓలేటి బ్రహ్మతేజ(20), ఓలేటి తులసీరావు(21), ఓలేటి ధర్మారావు(21), మాల్లాడి వంశీ(20), అర్ధాని వీరబాబు(21) అరెస్ట్ చేసి, ముమ్మిడివరం కోర్టులో హాజరుపర్చారు.  నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 

అసలేం జరిగిందంటే..?

కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు బరితెగిస్తున్నారు. మాయ మాటలు చెప్పిన ఓ బాలికను నిర్మానుస్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఐదుగురు దుండగులు.. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితును అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. 

లక్ష పరిహారం ఇస్తామని బెదిరింపులు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక.. ఈనెల 6వ తేదీన బట్టలు ఉతికేందుకు తీరప్రాంతంలో ఉన్న సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐదుగురు యువకులు ఆమె వెంటే వెళ్లారు. సదరు బాలికతో మాట కలిపారు. మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారంతా పారిపోయారు. తీవ్ర అస్వస్థతతకు గురైన బాలిక ముక్కుతూ, మూలుగుతూ చాలా కష్టంగా ఇంటికి చేరుకుంది. అయితే బాలిక అలా ఉండడంతో ఏమైందని ప్రశ్నించిన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని తెలిపింది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులు అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టిన నిందితులు బాధిత కుటుంబాన్ని బెదిరించడం మొదలు పెట్టారు. 

తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన వారిని ఎలాగైనా శిక్షించాలని తల్లిదండ్రులు గ్రామ పెద్దలను కలిసి విషయం తెలిపారు. పంచాయితీ పెట్టించారు. అయితే లక్ష రూపాయలు ఇస్తాం విషయం మర్చిపోమ్మని నిందితుల తల్లిదండ్రులు చెప్పగా.. అందుకు బాలిక కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక వీళ్లకు చెప్పి లాభం లేదనుకొని బాధిత కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గురువారం డీఎస్పీ వై.మాధవ రెడ్డి సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలిక తండ్రి  ఫిర్యాదు మేరకు సర్పంచ్ కుమారుడు ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు (తులసి), మల్లాడి వంశీ, ఓలేటి ధర్మరాజు, అర్థాని సత్తిపండులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కాట్రేని కోన ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపారు.

Published at : 18 Feb 2023 07:18 PM (IST) Tags: Crime News gang rape minor girl Konaseema News Arrest

సంబంధిత కథనాలు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

Nellore Police: నెల్లూరులో వెరైటీ ఛేజింగ్- కాల్వలో ఈత కొట్టిన నిందితుడు, పోలీసులకు చుక్కలు

Nellore Police: నెల్లూరులో వెరైటీ ఛేజింగ్- కాల్వలో ఈత కొట్టిన నిందితుడు, పోలీసులకు చుక్కలు

BRS MLA Accident: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కాన్వాయ్ కి ప్రమాదం - రెండు వాహనాలు ధ్వంసం

BRS MLA Accident: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కాన్వాయ్ కి ప్రమాదం - రెండు వాహనాలు ధ్వంసం

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌